ముగ్గురు భారత సంతతి యువకులకు జైలు శిక్ష
X
మహిళను అపహరించి, అత్యాచారయత్నం చేసిన కేసులో ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు యూకే కోర్ట్ జైలు శిక్ష విధించింది. అజయ్ దొప్పలపూడి (27), వాహర్ మంచాల (24), రానా యెల్లంబాయ్ (30) అనే ముగ్గురు యువకులను దోషులుగా తేల్చి.. 30 ఏండ్ల జైలు శిక్ష విధించింది
ఇంగ్లండ్ తూర్పు ప్రాంతంలోని లీసెస్టర్( Leicester ) నగరంలో నివసించే బాధితురాలు.. ఉద్యోగ విధులకు హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉన్న నిందితుల కారు( Audi Car)ను ట్యాక్సీగా భావించి ఆ వాహనంలో వెళ్లింది. కారులోని ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి మాట కలిపారు. కొద్దిసేపటికే కారు వేరే మార్గంలో వెళ్తోందని గుర్తించిన బాధితురాలు.. ఏం జరుగుతుదని ప్రశ్నించింది. నిందితులు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, కారులోంచి బలవంతంగా కిందికి లాగారు. ఆమెపై అత్యాచారానికి యత్నించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
నిమిషాల వ్యవధిలోనే అధికారులు అక్కడికి చేరుకుని.. ఆమెను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. .సీసీటీవీ ఫుటేజ్ ద్వారా లీసెస్టర్ సిటీ సెంటర్‌లో కారును గుర్తించారు. నిందితులు కీపర్ లీసెస్టర్ వెస్ట్‌కోట్స్ ప్రాంతంలోని గౌల్ స్ట్రీట్‌లో నివసిస్తున్నట్లు కనుగొని అరెస్ట్ చేశారు. ‘ముందస్తు ప్రణాళికతో ఈ ముగ్గురు మహిళను కిడ్నాప్ చేశారు. లైంగికదాడికి పాల్పడాలన్నది వారి ప్రణాళిక’ అని డిటెక్టివ్ కానిస్టేబుల్ జెమ్మా ఫాక్స్ చెప్పారు. విచారణ జరిపిన కోర్టు గతనెల 11న ముగ్గురినీ దోషులుగా నిర్ధారించింది. వారికి ఒక్కొక్కరికీ పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.