Home > అంతర్జాతీయం > Israel : రగులుతున్న 'గాజా'..రెండు రోజుల్లో 350 మంది మృతి

Israel : రగులుతున్న 'గాజా'..రెండు రోజుల్లో 350 మంది మృతి

Israel : రగులుతున్న గాజా..రెండు రోజుల్లో 350 మంది మృతి
X

ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ఇంకా చల్లారనే లేదు. హమాస్‌ను నామరూపం లేకుండా చేసేందుకు ఇజ్రాయెల్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో నిత్యం చాలా మంది అమాయకులు ప్రాణాలు వదులుతున్నారు. హమాస్‌కు ప్రధాన స్థావరంగా ఉన్న గాజా ప్రాంతంలో అనునిత్యం బాంబు దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గాజా ప్రాంతం మొత్తం దద్దరిళ్లిపోతోంది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రాంత ప్రజలు మరణిస్తున్నారు.

తాజాగా గత 48 గంటల్లో గాజా ప్రాంతంలో 350 మంది దుర్మరణం చెందారు. ఇజ్రాయెల్ సైన్యం వల్ల అంతమంది మరణించినట్లు హమాస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ గాజాలోని నాజర్ ఆస్పత్రిలో మరణించిన వారిని స్థానికులే ఖననం చేయాల్సి వస్తోందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఆస్పత్రిని ముట్టడించడం వల్ల రోగులకు తగిన వైద్యం అందకుండా చనిపోతున్నారని రోగుల కుటుంబీకులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

గత ఏడాది అక్టోబర్ 3వ తేదిన ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం చెలరేగింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో ఇప్పటి వరకూ 26,422 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 65,087 మంది గాయాలపాలయ్యారు. లక్షలాది మంది నగరాన్ని వదిలి వలసలు వెళ్లిపోయారని హమాస్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 7 వేలకు పైగా చిన్నారులు ప్రాణాలొదిరారు.


Updated : 29 Jan 2024 8:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top