Home > అంతర్జాతీయం > పాత బైక్ అమ్మితే లాభం రూ.3 కోట్లు..నక్కతోక తొక్కిన ఓనర్

పాత బైక్ అమ్మితే లాభం రూ.3 కోట్లు..నక్కతోక తొక్కిన ఓనర్

పాత బైక్ అమ్మితే లాభం రూ.3 కోట్లు..నక్కతోక తొక్కిన ఓనర్
X

లక్ష రూపాయలు పోసి బైక్ కొన్నా అమ్మే సమయానికి 30 వేలు కూడా చేతికి రావు. కానీ ఈ బైక్ మాత్రం ఓనర్‎కు భారీ లాభాన్ని అందించింది. రూ.16వేలు పలికే ఓ పాత బైకును రూ.3కోట్లకు కొనుగోలు చేశాడు ఓ బైకర్. అంత మొత్తంలో ఓ పాత బైక్ కోసం ఖర్చు చేయడం ఏంటని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే అది సూపర్ బైక్. 50 ఏళ్ల నాటిది. అయినా 3 కోట్లకు కొన్నాడంటే దాని స్పెషాలిటీ ఎమిటో తెలుసుకోవాల్సిందే.

హాలీవుడ్‌ సినిమా ‘ఘోస్ట్‌ రైడర్‌’ అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో హీరో కంటే, ఆ హీరో నడిపిన బైక్ చాలా ఫేమస్ అయ్యింది. ఈ బైక్ ని ఒక్కసారైనా కొనాలని, రైడ్ కి వెళ్లాలని సామాన్యులకు కూడా ఫీల్ అయ్యేలా చేసింది ఈ స్పోర్ట్స్‌ బైక్. అలాంటి ఓ బైక్ నే భారీ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేశాడు ఓ బైక్ లవర్. బైక్స్ అంటే పిచ్చితో 50 ఏళ్ల క్రితం అంటే 1973లో యూకేకు చెందిన వాకర్స్ 150 పౌండ్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.17వేలు పెట్టి స్పోర్ట్స్ బైక్ ను కొనుగోలు చేశాడు. ఈ బైక్ అచ్చం ఘోస్ట్‌ రైడర్‌ లో హీరో నడిపిన బైక్ లాంటిదే.

1931 లో రోల్స్‌రాయ్స్‌ కంపెనీ తయారు చేసిన బ్రౌ సుపీరియర్‌ ఎస్‌ఎస్‌100’ మోడల్‌ బైక్‌ ఇది. ఈ బైక్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. వరల్డ్‎లోనే మొదటి సూపర్ బైక్ ఇది. దాదాపు 20 సంవత్సరాలు ఈ బైక్ డ్రైవ్ చేశారు వాకర్స్. ఆ తరువాత కారు కొనడంతో దీనిని షెడ్డుకే పరిమితం చేశారు. దాదాపు 30 ఏళ్లకు పైగా బైక్ గ్యారేజ్‌కే పరిమితం అయ్యింది. అయితే కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనకెంతో ఇష్టమైన ఈ బైకును వేలానికి పెట్టాడు వాకర్స్. ఒకవిధంగా బైక్ అమ్ముతున్నానన్న బాధ ఉనప్నప్పటికీ ఆ బైక్ కు కళ్లుచెదిరే ధర పలికింది.ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ సూపర్‌బైక్‌ను 2.80 లక్షల పౌండ్లుపోసి కొన్నాడు. అంటే దాదాపు రూ.3 కోట్లు ఈ పాత బైక్ కోసం చెల్లించి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ బైక్ కొని 50 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఫుల్ కండీషన్ లో ఉందట. ఈ డబ్బుతో తన కాలికి సర్జరీ చేయించుకుంటానని వాకర్స్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Updated : 25 Jun 2023 9:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top