ఫ్రాన్స్లో భారీ భూకంపం.. కుప్పకూలిన ఇండ్లు
X
ఫ్రాన్స్లో భారీ భూకంపం వచ్చింది. భూ ప్రకంపనలకు దేశంలోని పశ్చిమ ప్రాంత ప్రజలు వణికిపోయారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైనట్లు ఫ్రెంచ్ సెంట్రల్ సీస్మోలజికల్ బ్యూర్ ప్రకటించింది. భూ ప్రకంపనల ధాటికి భారీ సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో గోడలకు పగుళ్లు వచ్చాయి. భూకంపం కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో చాలా ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. దాదాపు 1100 ఇండ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది.
ఫ్రెంచ్ సెంట్రల్ సీస్మోలాజికల్ బ్యూరో భూకంప తీవ్రత 5.8గా ప్రకటించగా నేషనల్ నెట్‌వర్క్ ఫర్ సీస్మిక్ సర్వైలెన్స్ మాత్రం 5.3 అని వెల్లడించింది. అయితే ఇప్పటివరకు ఫ్రాన్స్‌లోని ప్రధాన భూభాగంలో నమోదైన శక్తివంతమైన భూకంపాల్లో ఇది ఒకటని మంత్రి క్రిస్టోఫ్ బెచు చెప్పారు. 2000 సంవత్సరం తర్వాత ఫ్రాన్స్‌లో భారీ భూకంపం నమోదవడం ఇదే తొలిసారి. ఈ సారి భారీ భూకంపం రావడంతో ఫ్రాన్స్ ప్రజలు వణికిపోయారు. ఇండ్లలోంచి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల డ్యూక్స్ సర్వర్స్ విభాగంలో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. అతనికి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫ్రాన్స్‌లో 5 కన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపాలు రావడం చాలా అరుదు.