Home > అంతర్జాతీయం > US Citizenship : అత్యధిక అమెరికా పౌరసత్వాలు పొందిన రెండో దేశంగా భారత్‌

US Citizenship : అత్యధిక అమెరికా పౌరసత్వాలు పొందిన రెండో దేశంగా భారత్‌

US Citizenship : అత్యధిక అమెరికా పౌరసత్వాలు పొందిన రెండో దేశంగా భారత్‌
X

అమెరికా పౌరసత్వం పొందుతున్న వారిలో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. 2023లో అత్యధికంగా భారతీయులకే అమెరికా పౌరసత్వాన్ని అందించింది. ఇలా అమెరికా పౌరసత్వాలు పొందిన రెండో దేశంగా భారత్ నిలవడం విశేషం. గత ఏడాది అమెరికాలో 8,78,500 మంది కొత్తగా పౌరసత్వాన్ని పొందారు. వారిలో 59,100 మంది భారతీయులే ఉన్నట్లు అమెరికా పౌరసత్వ, వలసల సేవా సంస్థ (యూఎస్‌సీఐఎస్) నివేదిక విడుదల చేసింది.

దీంతో గత ఏడాది అమెరికా పౌరసత్వం పొందినవారిలో 6.7 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఇకపోతే ఈ జాబితాలో మెక్సికో మొదటి స్థానంలో ఉంది. 1.1 లక్షల పౌరసత్వాలతో మెక్సికో తొలి స్థానంలో ఉండగా మూడు, నాలుగు స్థానాల్లో ఫిలిప్పీన్స్, డొమినిక్ రిపబ్లిక్ వంటివి నిలిచాయి. విదేశీ వ్యక్తి అమెరికా పౌరుడు కావాలంటే ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టంలోని నిబంధనలకు అర్హత పొందాలి. అందుకోసం ఐదేళ్ల పాటు ఆ దేశంలోనే చట్టబద్దంగా నివశించి ఉండాలి. అప్పుడే వారికి అర్హత లభిస్తుంది.

దేశం పౌరసత్వాల సంఖ్య చూసినట్లైతే మెక్సికో నుంచి 1,11,500 మందికి అమెరికా పౌరసత్వం ఇచ్చింది. ఆ తర్వాత 59,100 మంది భారతీయులకు పౌరసత్వం ఇవ్వగా, ఫిలిప్పీన్స్ ప్రజల్లో 44,800 మందికి పౌరసత్వాలను అమెరికా అందించింది. ఆ తర్వాత డొమినిక్ రిపబ్లిక్ లోని 35,200 మందికి, క్యూబా లోని 33,200 మందికి అమెరికా తమ దేశ పౌరసత్వాలను అందించింది.


Updated : 13 Feb 2024 3:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top