అమెరికాలో కార్చిచ్చు..ఆరుగురు దుర్మరణం
X
అమెరికాలోని హవాయి ద్వీపంలో చెలరేగిన కార్చిచ్చు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మంటల దాటికి ఇప్పటి వరకు ఆరుగురు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. అడవుల నుంచి కార్చిచ్చు జనావాసాలకు వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
హవాయి ద్వీపంలో తీవ్ర బీభత్సం సృష్టిస్తున్న కార్చిచ్చుకు బలమైన గాలులు తోడవడంతో అంతకంతకూ విస్తరిస్తున్నాయి. నివాస ప్రాంతాలకు సైతం మంటలు వ్యాపించాయి. అనేక భవనాలు మంటల్లో బూడిదవుతున్నాయి. కరెంట్ సరఫరా నిలిచిపోయి వేలాది కుటుంబాలు అంధకారంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. మంటలు మరింత విజృంభించే అవకాశం ఉండటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్లాలని ఇప్పటికే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్మీ, నేవీకి కూడా బైడెన్ రంగంలోకి దింపారు. ఎమర్జెన్సీ సిబ్బంది ఓ వైపు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తూనే బాధితులను హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక అటు ఈ మంటల్లో చనిపోయిన వారికి బైడెన్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.