మొరాకోలో భారీ భూకంపం.. తెలుగు యూట్యూబర్ పరిస్థితి ఏంటి?
X
మొరాకో దేశంలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం (సెప్టెంబర్ 8) అర్ధరాత్రి వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8గా నమోదయింది. దాదాపు భూమి పొరల్లో 18 కిలోమీటర్ల లోతులో శక్తివంతమైన భూకంపం వచ్చింది. మొరాకోలోని రాబాత్ నుంచి మరకేష్ వరకు వచ్చిన భారీ భూకంపంతో ప్రజలు వణికిపోయారు. కాగా ఈ ప్రమాదం వల్ల దాదాపు 296 మంది చనిపోయారు. స్థానికులు, టూరిస్టులు ఇళ్ల నుంచి బయటికి పరిగెత్తి బహిరంగ ప్రదేశాల్లో తలదాచుకున్నారు. మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలుపగా ప్రజలు భయపడి రోడ్లపైనే ఉండటానికి ఇష్టపడుతున్నారు.
భూకంపం దాటికి పురాణ కట్టడాలు చాలావరకు నేలకూలాయి. పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా పూర్తిస్థాయి అంచనా రాలేదు. కాగా, ప్రముఖ తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషన్’ ఛానెల్ నడుపుతున్న అన్వేష్.. ప్రస్తుతం మొరాకోలోని రాబాత్ లో ఉన్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితిపై అన్వేష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, భూకంపం వచ్చిన సమయంలో వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితులను అన్వేష్ యూట్యూల్ లో పోస్ట్ చేశాడు. కాగా ప్రధాని మోదీ మొరాకో ప్రజలకు ధైర్యాన్నిచ్చారు. అన్ని విధాలా భారత ప్రభుత్వం అండగా ఉంటామని తెలిపారు.
A terrifying moment of a collapse captured by a security camera#Maroc #moroccoearthquake #Morocco #earthquakemorocco #earthquake pic.twitter.com/9aeA7XsmoS
— Kinetik (@KinetikNews) September 9, 2023