Home > అంతర్జాతీయం > అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
X

అమెరికాలో భారీ భూకంపం వచ్చింది. అలస్కా రీజియన్‌లో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.4గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. పసిఫిక్‌ మహాసముద్ర తీరంలోని ఉత్తర అమెరికా ఇతర తీర ప్రాంతాలు, కెనడా తీర ప్రాంతాలపై సునామీ ప్రభావం ఉండొచ్చని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది.

భూమికి 9.3కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అలాస్కా, అలూటియన్ దీవులు, కుక్ ఇన్లెట్ ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియలేదు. భూకంప క్రియాశీలక పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌‌లో అలస్కా కూడా ఓ భాగంగా ఉంది.

1964 మార్చిలో అలాస్కాలో 9.2 తీవ్రతో భారీ భూకంపం వచ్చింది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు రికార్డైన ఇంత తీవ్రత గల భూకంపం ఇదే కావడం విశేషం. అప్పట్లో వచ్చిన సునామీ అలాస్కా తీరప్రాంతంతో పాటు యూఎస్ వెస్ట్ కోస్ట్, హవాయి ప్రాంతాల్లో పెను హవాయిలలో పెను విధ్వంసం సృష్టించింది. ఆ సునామీ 250 మందికిపైగా పొట్టనబెట్టుకుంది.

Updated : 16 July 2023 2:46 PM IST
Tags:    
Next Story
Share it
Top