బెస్ట్ యాక్టర్..79 ఏళ్లకు ఏడవసారి తండ్రి
X
ఇంట్లో పిల్లలుంటే ఆ ఆనందమే వేరు. కొందరు పిల్లల లేరని బాధపడుతుంటే మరికొందరు దంపతులు పిల్లల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అయితే కొందరు మాత్రం లేటు వయసులో పిల్లలకు జన్మనిస్తుంటారు. తాజాగా 79 ఏళ్ల నటుడు ఏడవసారి తండ్రయ్యాడు. హాలీవుడ్ నటుడు అయిన 'రాబర్ట్ డి నీరో' రెండుసార్లు ఆస్కార్‌ను పొందాడు. అందులో ఓసారి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా, మరోసారి బెస్ట్ యాక్టర్‌గా అవార్డులను అందుకున్నాడు.
గాడ్ ఫాదర్-2 మూవీకి గాను రాబర్ట్ డి నీరోకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వచ్చింది. తాజాగా ఇప్పుడు ప్రకటించిన 2024 ఆస్కార్ నామినేషన్ లిస్టులో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో రాబర్ట్ నిలవడం విశేషం. ఓ వైపు ప్రొఫెషనల్ కెరీర్‌లో అవార్డులు పొందుతూ మరోవైపు పర్సనల్ కెరీర్‌లో వరుసగా తండ్రి అవుతూ వచ్చారు. రాబర్డ్‌కు ఇప్పటికే ఆరుగురు పిల్లలు ఉండగా ఇప్పుడు ఏడవ బిడ్డకు ఆయన తండ్రి అయ్యారు.
రాబర్ట్ డి నీరో గర్ల్‌ఫ్రెండ్ అయిన 'టిఫనీ చెన్' పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా రాబర్ట్ సంతోషం వ్యక్తం చేశారు. తన పాపకు గియా అనే పేరును కూడా పెట్టారు. ఆస్కార్‌కు ఎంపికైన సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన పాప గియా గురించి చెప్పుకొచ్చారు. తనకు చాలా టెన్షన్ ఉన్నా తన పాపను ఒక్కసారి చూస్తే అవన్నీ మర్చిపోతానని చెప్పారు. తన పాప ఎంతో ముద్దుగా ఉంటుందని, చాలా అందంగా, కళ్లతోనే తనను గమనిస్తూ ఉంటుందని, అది తనకెంతో ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఉన్నంత కాలం తన పాప గియాతోనే ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు.