Home > అంతర్జాతీయం > 100 ఏళ్లలో ఎన్నడూ చూడని విపత్తు..

100 ఏళ్లలో ఎన్నడూ చూడని విపత్తు..

100 ఏళ్లలో ఎన్నడూ చూడని విపత్తు..
X

శతాబ్దాల చరిత్ర కలిగిన నగరం శవాల దిబ్బలా మారింది..భారీ భవనాలు, వృక్షాలు, పశువులు మంటల్లో కాలిపోయి నగరం శ్మశానాన్ని తలపిస్తోంది. అమెరికాలోని హవాయి దీవులకు స్వర్గధామంగా పిలిచే లహైనా రిసార్టు నగర వీధులు కార్చిచ్చుతో రూపురేఖలు మారిపోయాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటలు ఇప్పటి వరకు 89 మందిని పొట్టనపెట్టుకుంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత వందేళ్లలో ఇలాంటి కార్చిచ్చును ఎన్నడూ చూడలేదని

అమెరికాలోని ఫైర్‌ అడ్మినిస్ట్రేటర్‌ లోరీ మూర్‌ మెరిల్లీ తాజాగా తెలిపారు.

అమెరికాలోని హవాయిలోని మౌయి దీవిలో ఉన్న లహైనా సిటీని కార్చిచ్చు కుదిపేసింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పర్యాటక నగరం మొత్తం బూడిదైంది. హరికేన్‌ ప్రభావంతో మంగళవారం ఏర్పడిన ఈ కార్చిచ్చు వందలాది కుటుంబాల్లో శోకాన్ని నింపింది. అప్రమత్తమైన అగ్నిమాపక దళాలు.. అమెరికా సైన్యం, వాయుసేన సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గతంలో గతంలో కాలిఫోర్నియాలోని బట్టీ కౌంటీలో కార్చిచ్చు చేసిన విధ్వంసంకన్నా ఇది పెద్దది అని తెలుస్తోంది.

ఈ విషాదకరమైన ఘటనలో ఇప్పటి వరకు 89 మంది చనిపోయారు. హవాయి రాష్ట్రంలో ఏర్పడిన కార్చిచ్చు అతిపెద్ద ప్రకృతి విపత్తుగా భావిస్తున్నారు అధికారులు. మంటల్లో దాదాపు నగరంలోని 2,200 నిర్మాణాలు పూర్తిగా కాలిపోయాయి. ఆస్తినష్టం సుమారు 6 బిలియన్‌ డాలర్లకుపైగా ఉంటుందని అంచనా. 1960లో హవాయిని భారీ సునామీ అతలాకుతలం చేసింది. ఈ జల ప్రళయంలో దాదాపు 61 మంది చనిపోయారు. 1946లో వచ్చిన సునామీ దాదాపు 158 మందిని బలితీసుకుంది. తాజాగా ఏర్పడిన కార్చిచ్చులో ఎంతమంది మరణించారో కచ్చితంగా తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు పడుతుందని గవర్నర్ తెలిపారు.











Updated : 13 Aug 2023 8:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top