Dog Meat : శతాబ్ధాల సంప్రదాయానికి చెక్.. కుక్క మాంసం తింటే 3 ఏళ్ల జైలు శిక్ష
X
ముక్కలేనిదే ముద్ద దిగని వారు చాలామందే ఉంటారు. మన దేశంలో చికెన్, మటన్, చేపలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. వీకెండ్స్ లో తెగ తినేస్తుంటారు కూడా. ఇక ఇతర దేశాల్లో అయితే పాములు, పురుగులు.. కుక్కలు, పందులు ఇలా ప్రతీదాన్ని లాగించేస్తుంటారు. మనకు విచిత్రంగా అనిపించినా వాళ్లకది కామన్. తరతరాలుగా వస్తున్న ట్రెడిషనల్ డిషెస్ కూడా. పలు రకాల మాంసాలపై మన దేశంలో ఉన్నట్లు.. వేరే దేశాల్లో పెట్టడం చాలా అరుదు. కానీ సౌత్ కొరియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆ దేశంలో ఎవరైనా కుక్క మాంసం కొన్నా.. తిన్నా కఠిన చర్యలు తీసుకుంటామని, 3 ఏళ్లు జైలులో వేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంపై పార్లమెంట్ ఆమోదం కూడా లభించింది.
ఎన్నో శతాబ్దాల నుంచి సౌత్ కొరియాలో కుక్క మాంసం వినియోగంలో ఉంది. పార్లమెంట్ ఆమోదించిన తీర్మానంపై సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సంతకం చేయనున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం సౌత్ కొరియాలో కుక్కల్ని చంపడం, బ్రీడింగ్ చేయడం, ట్రేడింగ్, అమ్మకాలు.. 2027 నాటికి అక్రమం కానున్నాయి. అంతేకాదు.. సౌత్ కొరియాలో ఇప్పుడు చాలామంది ఇంట్లో కుక్కుల ఫ్యామీలీ మెంబర్స్ అయిపోయాయి. రకరకాల బ్రీడ్లను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. చాలామంది ప్రజలు కుక్క మాంసాన్ని తినడం మానేశారు. దీంతో ఈ మధ్య కాలంలో కుక్క మాంసం దందా పెరిగిపోయింది. ఈ ప్రేమ వల్ల చాలామంది ప్రజలు రోడ్లెక్కి కుక్క మాంసం విక్రయాలు నిలిపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంట్ లో బిల్లు పెట్టగా.. తాజాగా ఆ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 208 మంది ఓటేశారు. దీంతో అక్కడ డాగ్ మీట్ ను బ్యాన్ చేశారు. ఇకపై సౌత్ కొరియాలో మానవ వినియోగం కోసం కుక్క మాంసాన్ని వాడితే మూడేళ్ల జైలుశిక్ష పడనున్నది.