Home > అంతర్జాతీయం > Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్కు భారీ షాక్

Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్కు భారీ షాక్

Trump  : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్కు భారీ షాక్
X

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. ప్రముఖ కవయిత్రి జీన్‌ కరోల్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్ లోని మాన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ట్రంప్‌ ఆమెకు 83.3 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు రూ.692 కోట్లకు పైగా చెల్లించాల్సిందేనని ఆదేశించింది. కొన్నేండ్ల క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్రంప్‌.. ఇప్పుడు తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ కరోల్‌ ఇటీవల పిటిషన్ వేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపిన కోర్టు తాజాగా ట్రంప్‌కు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. కరోల్ కు నష్టపరిహారం కింద 83.3 మిలియన్‌ డాలర్లతో పాటు..భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా మరో 65 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.





కాగా.. ఈ వ్యవహారంలో ట్రంప్‌కు ఇప్పటికే మరో కోర్టు జరిమానా విధించగా..జీన్‌ కరోల్‌ను ట్రంప్‌ లైంగికంగా వేధించారని గతేడాది మే నెలలో కోర్టు నిర్ధారించింది. అందుకుగాను కరోల్ కు 5 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అటు కరోల్‌ తన రచనలను విక్రయించేందుకు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్‌ విమర్శించడంతో పరువునష్టం కేసు దాఖలైంది. కోర్టు తీర్పుపై స్పందించిన ట్రంప్.. బైడెన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ’’కోర్టు తీర్పు చాలా హాస్యాస్పదంగా ఉందని..మన న్యాయ వ్యవస్థ నియంత్రణ కోల్పోయిందని చెప్పుకొచ్చారు. కోర్టు వ్యవహారాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారని మండిపడ్డారు. దీనిపై తాను పై కోర్టులో అప్పీలు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు.




Updated : 27 Jan 2024 3:38 PM IST
Tags:    
Next Story
Share it
Top