Home > అంతర్జాతీయం > రోడ్లపై బరితెగించి తిరుగుతున్న మానవ కుక్క..

రోడ్లపై బరితెగించి తిరుగుతున్న మానవ కుక్క..

రోడ్లపై బరితెగించి తిరుగుతున్న మానవ కుక్క..
X

మనిషికి ఒక్కోసారి విచిత్ర కోరికలు కలుగుతుంటాయి. అవి వింటే వింత కోరిక కాదు... ఇదేం పైత్యం రా బాబు అనుకుంటాం. జపాన్లోని ఓ వ్యక్తికి అలాంటి కోరికే కలిగింది.అందరిలా తను కూడా కుక్కను పెంచుకోవడం ఎందుకనుకున్నాడో ఏమో.. తానే ఓ కుక్కలా మారాడు. ఏకంగా దీన్ని కోసం 12 లక్షలు ఖర్చు పెట్టాడు. అచ్చం కుక్కలాగా మారి జపాన్ వీధుల్లో తిరుగుతున్నాడు.

జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తికి కుక్కగా మారిపోవాలన్న కోరిక కలిగింది. ఒళ్లంతా బొచ్చుతో పెద్దగా ఉండే జాతి కుక్క కోలీగా మారిపోవాలనుకున్నాడు. దీని కోసం టీవీ షోలకు దుస్తులు రెడీ చేసే ఏజెన్సీని సంప్రదించాడు. 12 లక్షలకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం ఆ సంస్థ 40 రోజుల్లో కోలీ కాస్ట్యూమ్ను రెడీ చేసింది.

టోకో ఆ డ్రెస్ వేసుకుని అచ్చం కుక్కలా మారిపోయాడు. హావభావాలు కూడా అలాగే ప్రదర్శిస్తూ.. జపాన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. అతడిని చూసి అసలు కుక్కలు కూడా నిజమైన కుక్కలాగే భావిస్తున్నాయి. పైగా అతడిని చూసి భయపడి దూరం వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే అతడు ఎంత కాలం కుక్కలా ఉంటాడనేదానిపై క్లారిటీ లేదు.





Updated : 31 July 2023 12:51 PM IST
Tags:    
Next Story
Share it
Top