అమెరికాలో నడి రోడ్డుపై తుపాకీతో యువతి హల్చల్.. వీడియో వైరల్
X
అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. నిత్యం ఏదో ఒక చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. దుండగుల కాల్పులకు అమాయక పౌరులు చనిపోవడం, గాయపడడం సర్వసాధరణంగా మారింది. తాజాగా న్యూయార్క్ సమీపంలోని నసావు కౌంటీలో ఓ మహిళ తుపాకీతో హల్చల్ చేసింది.
రోడ్డుమీదకు ఒక్కసారిగా వచ్చిన ఆ మహిళ ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు జరిపింది. నడిరోడ్డుపై గాల్లో కాల్పులు జరుపుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.
రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న కార్ల వైపు తుపాకీ గురిపెట్టి తలపై గురిపెట్టింది. తర్వాత తుపాకీని తన తలపై పెట్టుకుంది.దారినిపోయే వాహనదారులు ఆమె ప్రవర్తనతో ఆందోళనకు గురయ్యారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఆమెను తమ వాహనంతో ఢీకొట్టి కిందపడేలా చేశారు. క్షణాల్లోనే ఆమెను చుట్టుముట్టి తుపాకీతో పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె వింత ప్రవర్తన, కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Belmore Long Island, NY, a few moments ago .
— Viral News NYC (@ViralNewsNYC) August 15, 2023
A woman was waving a gun when Nassau County police took the person down. pic.twitter.com/4ym2KuJf7A