Chandrababu arrest: విదేశాల్లో చంద్రబాబుకు పెరుగుతున్న మద్దతు
X
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఐటీ ఉద్యోగులు మద్దతు తెలుపుతున్నారు. ఐటీ రంగానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేస్తూ నిలబడుతున్నారు. ఆయనపై అక్రమ కేసులు పెట్టారని, వెంటనే విడుదల చేయాలని నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా విదేశాల్లోని ఐటీ ఉద్యోగులు కూడా బాబు అరెస్ట్ కు వ్యతిరేకిస్తూ విదేశాల్లోనూ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా యూరప్ లోని బెల్జియం దేశంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 'మేము సైతం బాబు గారికి తోడుగా' కార్యక్రమం చేపట్టారు.
శనివారం బెల్జియంలోని బ్రసెల్స్ నగరం అటోమియం ముందు ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకుని నిరసనలు తెలిపారు. అంతేకాకుండా అమెరికాలోని ఫిలడెల్ఫియాలోనూ బాబుకు మద్దతునిచ్చాయి. సాఫ్ట్ వేర్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చిన గొప్ప నేత అంటూ మద్దతునిస్తున్నారు.