Home > అంతర్జాతీయం > హిజాబ్ ధరించకపోతే.. పార్కుల్లోకి నో ఎంట్రీ

హిజాబ్ ధరించకపోతే.. పార్కుల్లోకి నో ఎంట్రీ

హిజాబ్ ధరించకపోతే.. పార్కుల్లోకి నో ఎంట్రీ
X

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త కొత్త ఆంక్షలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. పరిస్థితులు మారడంతో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. తాలిబన్ల ఆక్రమణ జరిగినప్పటి నుంచి మహిళలు నరకం చూస్తున్నారు. మహిళలపై ఉక్కు పాదం మోపుతూ.. ఆంక్షలు విధిస్తున్నారు. ఒక్కొక్కటిగా వాళ్ల నుంచి దూరం చేస్తున్నారు. మొదట చదువుకు దూరం చేశారు. తర్వాత ఉద్యోగం, ఆటలుకు ఆంక్షలు విధించారు. ఇటీవల మహిళల బ్యూటీ సెలూన్లపై కూడా నిషేదం విధించారు. ఇన్ని పరిణామాల మధ్య కొందరు దేశం వదిలి వెళ్తుంటే.. మరికొందరు ఏం చేయలేక అక్కడే ఉండిపోతున్నారు.





తాజాగా.. తాలిబన్లు అక్కడి మహిళలపై మరో ఆంక్ష తీసుకొచ్చారు. హిజాబ్ ధరించిన వారికే ఆప్ఘనిస్థాన్ లోని జాతీయ పార్కుల్లోకి అనుమతిస్తామంటూ చట్టం తీసుకొచ్చారు. ఆంక్షన్ మీరిని మారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తాలిబన్ల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్కడి మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇస్లామిక్ నిబంధనలు సరిగా పాటించడం లేదట. ఆ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయాల పట్ల తాలిబన్ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.




Updated : 28 Aug 2023 4:25 PM IST
Tags:    
Next Story
Share it
Top