Home > అంతర్జాతీయం > బ్యూటీ పార్లర్స్‌పై నిషేధం..రోడ్డెక్కిన మహిళలు

బ్యూటీ పార్లర్స్‌పై నిషేధం..రోడ్డెక్కిన మహిళలు

బ్యూటీ పార్లర్స్‌పై నిషేధం..రోడ్డెక్కిన మహిళలు
X

అఫ్గానిస్తానిస్తాన్‌లో మహిళ పరిస్థితి రోజోరోజు దిగజారుతోంది. తాలిబన్లు అధికారం కైవసం చేసుకున్నాక అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల ఉద్యోగాలపై పరిమితులు విధించడం, పార్కులు, జిమ్‌లకు సైతం వెళ్లకుండా నిషేధం, మహిళా విద్యార్ధులకు ఉన్నత విద్యను నిలిపివేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే సతమతమవుతున్న ఆఫ్గాన్ మహిళల హక్కులను కాలరాసే విధంగా ఇటీవల మహిళల బ్యూటీ సెలూన్​లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నెల గడువు తర్వాత కచ్చితంగా సెలూన్లను మూసివేసి.. సంబంధిత నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని హెచ్చరించింది.

ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ప్రకారం మరో కొన్ని రోజుల్లోనే బ్యూటీ పార్లర్స్ మూసివేయాల్సి ఉంటుంది. ఆఫ్గాన్ ప్రభుత్వం నిర్ణయంపై మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ పొట్టకొట్టదంటూ బ్యూటీ పార్లర్స్ నిర్వహిస్తున్న కొంతమంది మహిళలు నిరసన చేపట్టారు. తమ గోడును ప్రభుత్వం వినాలని కోరుతున్నారు. ఇంతవరకు ఎవ్వరూ తమతో చర్చలు నిర్వహించే ప్రయత్నమైనా చేయలేదని నిరసనకారులు వాపోతున్నారు.

బ్యూటీ పార్లర్ల సంప్రదాయం ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని, సెలూన్ లో కొన్ని ట్రీట్మెంట్లు అయితే మన సంప్రదాయాలను మంటగలిపే విధంగా ఉందన్నది ప్రభుత్వం అభిప్రాయపడి వాటిపై నిషేధాన్ని విధించింది. మహిళలను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతన్నాయి.


Updated : 19 July 2023 8:06 PM IST
Tags:    
Next Story
Share it
Top