Home > అంతర్జాతీయం > ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లెం.. రెండ్రోజులు తర్వాత తిరిగి వెళ్లిన కెనడా పీఎం

ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లెం.. రెండ్రోజులు తర్వాత తిరిగి వెళ్లిన కెనడా పీఎం

ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లెం.. రెండ్రోజులు తర్వాత తిరిగి వెళ్లిన కెనడా పీఎం
X

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఎట్టకేలకు కెనడా బయలుదేరారు. జీ 20 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కి వచ్చిన ఆయన మంగళవారం స్వదేశానికి తిరిగివెళ్లారు. నిజానికి ట్రూడో సమ్మిట్‌లో పాల్గొన్న తర్వాత సెప్టెంబర్ 10 సాయంత్రం కెనడా తిరిగి వెళ్లాల్సి ఉంది. అయితే ముందస్తు తనిఖీల్లో ఆయన అధికారిక విమానం ఎయిర్‌బస్‌ CFC001లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆయన ప్రయాణం వాయిదా పడింది. దీంతో ట్రూడో ఆయన టీంతో కలిసి 36 గంటల పాటు ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

రెండు రోజుల అనంతరం ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లెంను సరిదిద్దడంతో ట్రూడో మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు కెనడా బయలుదేరారు. ఆయనకు కేంద్రం తరఫున మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వీడ్కోలు పలికారు. ట్రూడో క్షేమంగా కెనాడాకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఒకవైపు ట్రూడోను తీసుకెళ్లడానికి కెనడా ఎయిర్‌ఫోర్స్‌ మరో ఫ్లైట్ భారత్‌కు పంపింది. ఈలోపే సమస్య పరిష్కారం కావడంతో వచ్చిన ఫ్లైట్ లోనే ట్రూడో తిరిగి వెళ్లారు.

కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. 2016లో యూరోపియన్‌ యూనియన్‌తో చర్చల కోసం బెల్జియం బయల్దేరిన కెనడా పీఎం ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లెం తలెత్తింది. దీంతో టేకాఫ్‌ అయిన 30 నిమిషాలకే తిరిగి కెనడాకు తిరిగి వచ్చారు. 2019 అక్టోబర్‌లో ట్రూడో విమానం ఓ గోడను ఢీకొంది. అప్పట్లో దాని ముందుభాగం, కుడి వైపు ఇంజిన్‌ దెబ్బతింది. దీంతో ఆ విమానాన్ని చాలా నెలల పాటు పక్కకు పెట్టేశారు. అదే ఏడాది డిసెంబర్ లో నాటో సమ్మిట్ సమయంలో బ్యాకప్ ఫ్లైట్ ఉపయోగించారు.

Updated : 12 Sept 2023 6:41 PM IST
Tags:    
Next Story
Share it
Top