Home > అంతర్జాతీయం > ఓవైపు తరుముకొస్తున్న తుఫాన్.. మరోవైపు కిమ్ ఏమని ఆదేశించాడంటే..?

ఓవైపు తరుముకొస్తున్న తుఫాన్.. మరోవైపు కిమ్ ఏమని ఆదేశించాడంటే..?

ఓవైపు తరుముకొస్తున్న తుఫాన్.. మరోవైపు కిమ్ ఏమని ఆదేశించాడంటే..?
X

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నిర్ణయాలు, చర్యలతో అందరినీ ఆందోళనకు గురిచేస్తుంటారు. ఎప్పుడు ఎలాంటి ఆంక్షలు విధిస్తాడో తెలియకు అటు ఉత్తర కొరియా ప్రజలు కూడా భయపడుతుంటారు. అలా ఉంటాయి కిమ్ నిర్ణయాలు. తాజాగా ఆయన ఇచ్చిన ఆదేశాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. ప్రస్తుతం ఉత్తర కొరియాను ఖానున్ తుఫాన్ భయపెడుతుంది. ఈ క్రమంలో ఆయన జారీ చేసిన ఆదేశాలు చర్చనీయావంశంగా మారాయి.

ఉత్తర కొరియాలో కిమ్ రాజవంశీకుల విషయంలో చిన్నపాటి తప్పిదాలకూ కఠిన శిక్షలు తప్పవు. దేశాన్ని ముంచెత్తే విపత్కర పరిస్థితుల్లోనూ.. తమ వంశ పాలకుల ప్రచార చిత్రాలు, విగ్రహాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కిమ్ ఆదేశించారు. పౌరులకు తుఫాన్ హెచ్చరికలు జారీ చేస్తూనే.. ఉత్తర కొరియన్ల ప్రధాన దృష్టి.. తమ దేశ నాయకుల ప్రచార చిత్రాలతోపాటు విగ్రహాలు, ఇతర స్మారక చిహ్నాల భద్రతపై ఉండాలని కిమ్‌ ప్రభుత్వం ఆదేశించింది.

ఇప్పటికే జపాన్‌ను కుదిపేసిన ‘ఖానున్‌’ తుఫాన్ కొరియాకు చేరుకుంది. ఈ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కొరియాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలోనే తుఫాన్ శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర కొరియాలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా కిమ్ ఇచ్చిన ఆదేశాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. అదే సమయంలో తుఫాన్ వల్ల దేశ ఆర్థిక ఉత్పత్తి ప్రభావితం కాకుండా చూసుకోవాలని కూడా ఆదేశించారు.కాగా ఉత్తర కొరియా.. ప్రకృతి విపత్తులతో తీవ్ర నష్టాలను చవిచూస్తుంటుంది. అటవీ నిర్మూలన.. పెద్దఎత్తున వరదలకు కారణమవుతోంది.

Updated : 10 Aug 2023 9:54 PM IST
Tags:    
Next Story
Share it
Top