Home > అంతర్జాతీయం > ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి పరువు పోగొట్టుకున్న పోలీసులు.. పాపం.. నిండు గర్భవతిని..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి పరువు పోగొట్టుకున్న పోలీసులు.. పాపం.. నిండు గర్భవతిని..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి పరువు పోగొట్టుకున్న పోలీసులు.. పాపం.. నిండు గర్భవతిని..
X

మనిషి మేధస్సుకు మరేదీ సాటిరాదని తేలిపోయింది. కృత్రిమ మేధ మేలుతో పాటు కీడు కూడా చేస్తుందని మరోసారి అర్థమైంది. ఓ కేసును ఛేదించడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను నమ్ముకున్న పోలీసులు పరువు పోగొట్టుకున్నారు. అభం శుభం ఎరగని ఓ గర్భవతిని అరెస్ట్ చేసి, జడ్జీతో నానా చీవాట్లూ తిన్నారు. అమెరికాలోని డెట్రాయిట్‌లో ఈ సంఘటన జరిగింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగిన ఓ చోరీ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులను నిందితులను గుర్తించడానికి ఏఐ వాడారు. నేరానికి పాల్పడిన ముఠాలోని ఒక మహిళ గుర్తించడానికి గ్యాస్‌ స్టేషన్‌లోని సీసీటీవీ వీడియో ఫుటేజ్‌ని పరిశీలించారు. ఫేస్‌ రికగ్నిషన్‌ ఎనాలసిస్‌ సాయంతో పాత నేరస్తుల డేటాను పోల్చి చూస్తుండగా 32 ఏళ్ల పోర్చ్ ఉడ్రఫ్ అనే మహిళ ముఖంతో సరిపోలింది. దొరికింది దొంగ అని వెంటనే ఆమె ఇంటికి అడ్రస్ కనిపెట్టి వారంటుతో వెళ్లి అరెస్ట్ చేశారు. తను ఏ నేరమూ చేయలేదని ఉడ్రష్ మొత్తుకున్నా ఫలితం లేకపోయింది.

ఆమె 8 నెలల గర్భవతి అని, ఇద్దరు బిడ్డల తల్లి అన్న కనికరం కూడా లేకుండా బేడీలు వేసి జైలుకు తీసుకెళ్లారు. విచారణలోనూ ఆమె నేరస్తురాలు కాదని తెలిసినా ఏఐని నమ్ముకుని కేసు పెట్టారు. చోరీ బాధితులు ఓ గర్భిణిపై అనుమానం వ్యక్తం చేశారా అని ఉడ్రఫ్ అడగ్గా లేదని పోలీసులు చెప్పారు. కోర్టు విచారణలోనూ చేతులెత్తేశారు. ఉడ్రఫ్ నేరానికి పాల్పడిందని ఎలా చెబుతున్నారని జడ్జీ అడగ్గా, ఏఐ ఆధారంగా చెబుతున్నామన్నారు. అదొక్క ఆధారమే సరిపోదని, ఉడ్రఫ్ నేరం చేసిందని పక్కగా ఆధారాల్లేవు కనుక ఆమె నిర్దోషి అని జడ్జీ తీర్పిచ్చారు. నేరాల విచారణలో ఏఐ ఒక్కటే సరిపోదని, నిర్దేశిత విధానాలను పాటించాలని అక్షింతలు వేశారు.

Updated : 16 Aug 2023 10:50 AM IST
Tags:    
Next Story
Share it
Top