Alaska Airlines : గాల్లో ఉండగానే ఊడిన విమానం డోర్
X
అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అమెరికాలోని పోర్ట్‌లాండ్ నుంచి ఒంటారియోకు బయలుదేరిన అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కిటికీ 16 వేల అడుగుల ఎత్తులో అకస్మాత్తుగా ఊడిపోయింది. ఈ హఠాత్తు పరిణామంతో ప్రయాణికులు హతశులయ్యారు. ఈ ఘటనతో విమానాన్ని పోర్ట్‌ల్యాండ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో ప్లైట్‌లో 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇక ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఊడిన డోర్ దగ్గర ప్రయాణికుల సీట్లు ఉండడంతో వారి చేతులలోని ఫోన్లు బయటకు ఎగిరిపోయాయి.
అలాస్కా ఎయిర్‌లైన్స్ ఈ ఘటనపై ఎక్స్‌లో పోస్టు పెట్టింది ‘ పోర్ట్‌లాండ్ నుంచి ఒంటారియో బయలుదేరిన AS1282 విమానానికి కొద్దిసేపటికే సమస్య తలెత్తింది. దాంతో తిరిగి విమానాన్ని సేఫ్ ల్యాండ్ చేశాం.. ప్రమాద సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన విచారణ చేస్తున్నాం’ అని తెలిపింది. అలాగే ఈ సంఘటనపై యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్( NTSB) కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.