ల్యాబ్ చికెన్ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
X
చికెన్ తినాలంటే కోడిని కోయాల్సిందే. కానీ ఇకపై ఆ అవసరం రాదనే చెప్పాలి. కోడిని కోయకుండానే దాని రక్తం చూడకుండానే చికెన్ తినొచ్చు. అవును ఇది నిజం. మొదటిసారిగా ల్యాబ్‌లో రూపొందించిన చికెన్‌ను అమ్మేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ల్యాబ్ చికెన్‌ను అభివృద్ధి చేసే రెండు కంపెనీలకు మాత్రమే ఈ అవకాశాన్ని అందించింది. మొదట పలు రెస్టారెంట్లలో అమ్మకాలు జరిపిన అనంతరం సూపర్ మార్కెట్లలో ఈ చికెన్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
కోడి కణాలను తీసుకుని ల్యాబ్స్‌లో చికెన్‌ను వృద్ధి చేస్తారు. ఈ మూలకణాలకు పోషకాలను అందించి, వెచ్చగా ఉండే విధంగా ఓ ప్రత్యేకమైన రసాయనంలో దానిని భద్రపరుస్తారు. సుమారు 2 నంచి 6 వారాల తరువాత ఈ కణాలు కాస్త మీట్‌గా మారుతుంది. ఈట్ జస్ట్ కంపెనీ అనే సంస్థ గుడ్ మీట్ పేరుతో ల్యాబ్ గ్రోన్ చికెన్‌ను తయారు చేస్తోంది. ఈ ల్యాబ్ గ్రోన్ చికెన్ అమ్మకాలకు అమెరికా ఎఫ్డీఏ సంస్థ రెండు సంస్థలకు ఓకే చెప్పింది. సింగపూర్‌లో ఇప్పటికే ఈ చికెన్‌ను విక్రయిస్తోంది. ఇలా ల్యాబుల్లో చికెన్ ఉత్పత్తి చేయడం వల్ల పెంపకం, దాణా ఖర్చులతో పాటు వ్యర్థాల నిర్వహణ సమస్యలు ఉండవని నిపుణులు పేర్కొంటున్నారు. అదే విధంగా మాంసం కోసం జంతువులను వధించాల్సిన పని ఉండదని చెబుతున్నారు. ఆహార భద్రత సమస్యలకు ఈ ల్యాబ్ చికెన్ ఓ ప్రత్యామ్నాయ మార్గమని సూచిస్తున్నారు.
శాస్త్రీయ పద్దతిలో చికెన్‌ను ఉత్పత్తి చేస్తుందని ఈట్ జస్ట్ సంస్థ మాత్రమే కాదు ఇప్పటికే సింగపూర్‌కు చెందిన స్టార్టప్ సంస్థ ల్యాబ్‌లో రొయ్యలను పెంచుతోంది. ఈ క్రమంలో ఈట్ జస్ట్ సంస్థ చికెన్‌తో పాటు త్వరలో పంది మాంసాన్ని కూడా విక్రయించాలని ప్లాన్ చేస్తోంది.