Home > అంతర్జాతీయం > వీసా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారా.. అయితే నో వర్రీ!!

వీసా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారా.. అయితే నో వర్రీ!!

వీసా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారా.. అయితే నో వర్రీ!!
X

ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి అగ్రరాజ్యం అమెరికా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో వీసా ఇంటర్వ్యూల్లో తిరస్కరణకు గురైన వారికి మరో అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబరు రెండో వారం వరకు ఫాల్‌ సీజనుకు సంబంధించి విద్యాసంస్థలు తరగతులను ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా తాజాగా తీసుకున్న నిర్ణయం ఉన్నత విద్యకోసం అక్కడికి వెళ్లాలనుకునే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆనందానికి లోనుచేస్తోంది. ఇప్పటివరకూ వీసా స్లాట్లు లభించని వారికి కూడా స్లాట్లను వేర్వేరుగా విడుదల చేసింది. ఢిల్లీ రాయబార కార్యాలయంతో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతాల్లోని కాన్సులేట్లలో ఈ స్లాట్లను విడుదల చేశారు. అయితే, హైదరాబాద్‌లో స్లాట్లు జారీ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకూ అమెరికా విద్యాసంస్థలు ఫాల్ సీజన్ తరగతులను ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో వీసా ఇంటర్వ్యూ కొత్త స్లాట్లను విడుదల చేసేందుకు అమెరికా నిర్ణయంచడంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఫాల్ సీజన్‌లో భారతీయులకు లాభించేలా వీసాలు జారీ చేసేందుకు అమెరికా నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే భారీగా వీసాలు జారీ చేసింది.

అమెరికా వీసా ఇంటర్వ్యూలో వీసా లభించని వారు రెండు నెలలుగా వాటి కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో ఇలాంటి వారికి వెంటనే రెండోసారి వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం ఉండేది. అయితే, ఒక విద్యాసంవత్సరంలో ఒకేసారి ఇంటర్వ్యూకు హాజరయ్యేలా అమెరికా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసింది. కానీ ఈసారి రెండోసారి ఇంటర్వ్యూకు ప్రత్యేకంగా స్లాట్లు కేటాయించడంతో అనేక మందిలో మళ్లీ ఆశలు చిగురించాయి.

మరోవైపు, పర్యాటక వీసాల కోసం భారతీయులకు నిరీక్షణ తప్పడం లేదు. తొలిసారి అమెరికా వెళ్లేందుకు వీసాల కోసం పలువురు కొన్ని నెలలుగా ఎదురు చేస్తున్నారు. ఇటీవల స్వల్ప సంఖ్యలో స్లాట్లు విడుదల చేసినా ఇంటర్వ్యూ తేదీలు 2024లో ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. అయితే, విద్యార్థి వీసా ప్రక్రియ పూర్తయిన తరువాత పర్యాటక వీసా స్లాట్లు విడుదల చేసే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.



Updated : 13 Aug 2023 3:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top