‘గాలికి ఊగిన విమానం’..! హడలిపోయిన ప్రయాణికులు: వీడియో వైరల్
X
గెరిట్ తుపాను ఐర్లాండ్, యూకే దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ఆయా దేశాల్లో విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈదురు గాలుల ప్రభావం వల్ల ఇటీవల ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ టైంలో ప్రమాదకరంగా ఊగిపోయింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లాస్‌ఏంజెల్స్ నుంచి వచ్చిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 విమానానికి ఈ ప్రమాదం తప్పింది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య ల్యాండ్ అయింది.
రన్ వేపై ల్యాండ్ అవుతుండగా.. ఈదురు గాలుల ప్రభావంతో విమానం ఊగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. దాదాపు 10 సెకన్లపాటు గాలికి ఊగిన విమానం చివరికి సేఫ్ గా ల్యాండ్ అయింది. అదృష్టవశాత్తు విమానంలో ఉన్నవారికెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.