విమాన ప్రయాణంలో భయం..భయం
X
విమాన ప్రయాణంలో జరిగిని కొన్ని సంఘటనలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తాయి. ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. తాజాగా అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలోని ప్రయాణికులకు ఊహించని పరిణామం ఎదురైంది. వేల మీటర్ల ఎత్తులో ఉన్న విమానం క్షణాల్లో కిందకు దిగడం టెన్షన్ పెట్టించింది.
ఉత్తర కరోలినాలోని షార్లెట్ నుంచి ఫ్లోరిడాలోని గెయిన్జ్‌విల్‌కు విమానం బయల్దేరింది. అయితే 29వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు ఏర్పడ్డాయి. కేవలం మూడు నిమిషాల వ్యవధిలో ఏకంగా 15 వేల అడుగులు కిందికి దిగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే మాస్కుల ద్వారా ప్రయాణికులకు ఆక్సిజన్ సౌకర్యం అందజేశారు.
చివరకు విమానం క్షేమంగా ల్యాండింగ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో పీడనానికి సంబంధించిన సమస్య తలెత్తడమే దీనికి కారణమని విమానయాన సంస్థ తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. ఈ అనుభవాన్ని మానంలో ప్రయాణించిన, ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హరిసన్ హోవ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.