వడగళ్ళకు తుక్కుతుక్కు అయిన విమానం
X
వడగళ్ళ దెబ్బకు విమానం ముందు భాగం తుక్కుతుక్కు అయింది. దీంతో దాన్ని అర్జెంట్ గా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇలటీలో మిలన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ కి వెళుతున్న డెల్టా ఫ్లైట్ కి ఇది జరిగింది. రోమ్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
డెల్టాకు చెందిన 185 విమానం 215 మంది ప్రయాణికులతో ఇటలీలో లోని మిలన్ నుంచి బయలుదేరింది. ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు వాతావరణం బాగానే ఉంది. కానీ 15 నిమిషాల్లో మొత్తం మారిపోయింది. విపరీతమైన వడగళ్ళు, పిడుగులతో కూడిన వర్షం మొదలైంది. వడగళ్ళు చాలా దారుణంగా పడడంతో....విమానం ముక్కు, రెక్కలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పైలట్లకు ఫ్రైట్ కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందికరం అయింది. దీంతో విమానాన్ని వెంటనే రోమ్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
అయితే ఇందులో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రస్తుతం విమానాన్ని పరిశీలిస్తున్నామని చెబుతున్నారు డెల్టా ఎయిలైన్స్ ప్రతినిధులు. వడగళ్ళ వర్షంలో చిక్కుకున్న విమానం ఒక్కసారిగా అదుపు తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఒకదశలో ఫ్లైట్ ముక్కలైపోతుందని భయపడ్డామని అంటున్నారు. రోలర్ కోస్టర్ ఎక్కినట్లు అనిపించిందని తెలిపారు.