Home > అంతర్జాతీయం > అమెరికా వీసాల్లో భారతీయుల హవా.. ఇప్పటికే ఏకంగా.. 10,00,000

అమెరికా వీసాల్లో భారతీయుల హవా.. ఇప్పటికే ఏకంగా.. 10,00,000

అమెరికా వీసాల్లో భారతీయుల హవా.. ఇప్పటికే ఏకంగా.. 10,00,000
X

అమెరికా వీసాల్లో భారతీయులు దుమ్ము రేపుతున్నారు. విద్య, ఉద్యోగం, పర్యాటకం.. కారణం ఏదైనా సరే అగ్రరాజ్యానికి క్యూ కడుతున్నారు. ఫలితంగా భారత్‌లోని అమెరికా ఎంబసీ రికార్డు సృష్టించింది. ఈ ఏడాదిలో ఇప్పటికే 10 లక్షల మంది భారతీయులకు వీసాలు జారీ చేశామని తెలిపింది. ఈ ఏడాది వన్ మిలియన్ వీసాలను జారీ చేయాలన్న లక్ష్యాన్ని ఇప్పటికే దాటామంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది జారీ అయిన వీసాలు 20 శాతం ఎక్కువ.

‘‘మిషన్1మిలియన్ పూర్తయ్యింది! మేం ఇక్కడితో మేం ఆగిపోం. రాబయే నెలల్లో మరిన్ని అందజేస్తాం. మరింత మంది భారతీయులకు మా దేశంలో పర్యటించే అవకాశం కల్పిస్తాం’’ అని తెలిపింది. భారత్, అమెరికాల బంధం ప్రపంచంలో దౌత్యబంధాల్లో చాలా కీలకమైందని మన దేశంలోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి అన్నారు. వచ్చే రోజుల్లో మరింత మంది భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేస్తామన్నారు. అమెరికా జారే చేస్తున్నవీసాల్లో 10 శాతం భారతీయులకే దక్కుతున్నాయి. ప్రతి నాలుగు వీసాల్లో ఒకటి భారతీయులకు దక్కుతోంది.

Updated : 28 Sept 2023 2:59 PM IST
Tags:    
Next Story
Share it
Top