క్యాన్సర్కు మందొచ్చింది.. ఆ చిన్నారి పేరుమీదుగా
X
క్యాన్సర్ కు మందొచ్చింది. అమెరికా సైంటిస్ట్ లు కొత్త మందును కనుగొన్నారు. ఏటా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది చనిపోతున్నారు. ఒక్క అమెరికాలోనే ఏడాదికి 600 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందులో ఎక్కువ మంది న్యూరోబ్లాస్టోమా బారిన పడుతున్నారు. దాన్ని నివారించేందుకు ఈ మందును కనుగొన్నారు అమెరికన్ సైంటిస్ట్ లు. ఆ మందుకు ఏవోహెచ్1996 అని పేరు పెట్టారు. ఇది ఓ అమెరికన్ చిన్నారి పేరు. తన పుట్టిన సంవత్సరానికి గుర్తుగా క్యాన్సర్ మందుకు తన పేరు పెట్టారు. 1996లో ఒలివియా హీలీ అనే అమ్మాయి ఇండియానా జన్మించింది. తొమ్మిదేళ్లుగా పోరాడి తన 9 ఏట ప్రాణాలు కోల్పోయింది. ఒలివియా మరణంతో మనస్తాపం చెందిన సైంటిస్టులు.. తన కోసం క్యాన్సర్ మందు తయారుచేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో మాట్లాడిన సైంటిస్ట్ లు.. ఏవోహెచ్1996 మందు అన్ని రకాల క్యాన్సర్ కణతులను తొలగిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ మందు మొదటి క్లినికల్ ట్రయల్స్ కాలిఫోర్నియాలోని సిటీ ఆఫ్ హోప్ హాస్పిటల్ లో జరుపుతున్నట్లు చెప్పారు. ఈ మందు కణ తంతువులోని క్యాన్సర్ కణాలు చనిపోయేటా చేయడంతో రొమ్ము, మెదడు, అండాశయం, చర్మం, ఊపిరితిత్తులకు సోకే వివిధ రకాల క్యాన్సర్ ను వివారిస్తుందని సైంటిస్ట్ లు చెప్తున్నారు.