Home > అంతర్జాతీయం > మనిషికి పంది కిడ్నీలో కీలక విజయం.. ఏకంగా..

మనిషికి పంది కిడ్నీలో కీలక విజయం.. ఏకంగా..

మనిషికి పంది కిడ్నీలో కీలక విజయం.. ఏకంగా..
X

మనిషికి జంతు అవయవాల మార్పిడిలో వైద్యులు కీలక విజయం సాధించారు. భవిష్యత్తులో జంతువుల అవయవాలు మనుషుల ప్రాణాలకు భరోసా ఇస్తాయనే నమ్మకం మరింత దృడపడిందని చెప్పారు. ఒక మనిషికి అమర్చిన పంది కిడ్నీ ఏకంగా రెండు నెలలు పనిచేసింది. ఇదివరకు కూడా మనిషికి పంది కిడ్నీని అమర్చినా ఒకటి రెండు రోజులకు మించి పనిలేయలేదు. జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీతో చేసిన తాజా ప్రయోగంలో రెండు నెలలు పనిచేసింది.

అమెరికాలోని ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్ సంస్థకు చెందిన డాక్టర్‌ రాబర్ట్ మోంట్‌గోమెరీ వైద్య బృందం ఈ ప్రయోగం నిర్వహించింది. బ్రెయిన్ డెడ్‌కు గురైన మారిస్‌ మిల్లర్‌ అనే బ్రెయిన్‌ డెడ్‌ అనే 57 ఏళ్ల కేన్సర్ పేషంటుకు కృత్రిమ శ్వాస అందిస్తూ ఈ ప్రయోగం చేపట్టారు. రోగనిరోధక మందులు అందిస్తూ కిడ్నీ పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరిచారు. జూలై 14న పంది కిడ్నీని అమర్చగా నెల రోజులు బాగానే పనిచేశారు. రెండో నెలలో పనితీరు మందగించింది. మొత్తం 61 రోజుల పాటు పంది కిడ్నీ పనిచేసిది. మిల్లర్ కుటుంబ సభ్యుల అనుమతితో దాన్ని తొలగించి అతణ్ని మృతదేహాన్ని అప్పగించారు. రెండు నెలల పాటు పంది కిడ్నీ పనితీరునును విశ్లేషించామని, లోటుపాట్లను సవరింపుపై వచ్చిన అవగాహనతో ఈసారి మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తామనే ఆశ ఉందని మాంటిగోమెరీ చెప్పారు.

Updated : 17 Sept 2023 2:50 PM IST
Tags:    
Next Story
Share it
Top