Home > అంతర్జాతీయం > ChatGPT : చాట్ జీపీటీ.. 15 వేలతో తయారుచేసి 1.20 కోట్లకు అమ్మారు..

ChatGPT : చాట్ జీపీటీ.. 15 వేలతో తయారుచేసి 1.20 కోట్లకు అమ్మారు..

ChatGPT : చాట్ జీపీటీ.. 15 వేలతో తయారుచేసి 1.20 కోట్లకు అమ్మారు..
X

ఏ సమాచారం కావాలన్నా గూగుల్, వికీపీడియాలను చూస్తుంటాం. ఇప్పుడు వీటికీ చాట్ జీపీటీ కూడా తోడైంది. గూగుల్, వికీపీడియాల్లో వీలు కాని చర్చలను చాట్‌లో చేసుకోవచ్చు. అనుమానాలు తీర్చుకోవచ్చు. ఈ కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో చివరికి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ కూడా రాసేస్తున్నారు. అయితే చాట్ జీపీటీ సహజమైన తెలివితేటలు కోల్పోయేలా చేస్తోందని కొన్ని దేశాలు విద్యాసంస్థల్లో ఇప్పటికే నిషేధం విధించాయి. విషయంలోకి వస్తే.. చాట్ జీపీటీ సాయంతో ఇద్దరు టెక్ నిపుణులు కేవలం రూ. 15 వేలతో ఓ ఏఐ స్టార్టప్‌ను తయారు చేసి ఏకంగా రూ. 1.20 కోట్లుకు అమ్మారు.

అమెరికాకు చెందిన సాల్వతోర్ ఏయిలో, మోనికా పవర్స్ అనే సాఫ్ట్‌వేర్ నిపుణులు చాట్ జీపీటీని వాడి DimeADozen పేరుతో ఓ ఏఐ టూల్‌ను తయారు చేశారు. బిజినెస్ ఐడియాలను, రిపోర్టులను అందించే ఈ టూల్‌ను అరోమెన్సా, డేనియల్ డి కార్నీల్ అనే సాఫ్ట్‌వేర్ నిపుణుల జంట కొనుక్కుంది. డైమ్‌ఎడజన్ టూల్ స్టార్టప్ కంపెనీలకు కన్సల్టెన్సీ సేవలు అందిస్తుంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, కస్టమర్లను ఎలా సంపాదించుకోవాలి, పోటీదారులు ఎవరు, వాటికి పోటీ ఎలా ఇవ్వాలి వంటి విశ్లేషణలను అందజేస్తుంది. ఏయిలో, మోనికాలు చాట్ జీపీటీ సంభాషణల్లో ఇలాంటి అంశాలపై ప్రశ్నలు సంధించి డేటా సేకరించారు. తర్వాత వాటిని సరళీకరించి టూల్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న పరిశోధన విధానాలకంటే DimeADozen చాలా వేగంగా పని చేస్తూ ఖర్చును భారీగా తగ్గిస్తుందని చెప్పారు.


Updated : 23 Oct 2023 6:09 PM IST
Tags:    
Next Story
Share it
Top