Home > అంతర్జాతీయం > అమెరికా చేసిన తప్పు.. రష్యా చేతిలో మిలిటరీ సీక్రెట్స్..!

అమెరికా చేసిన తప్పు.. రష్యా చేతిలో మిలిటరీ సీక్రెట్స్..!

అమెరికా చేసిన తప్పు.. రష్యా చేతిలో మిలిటరీ సీక్రెట్స్..!
X

ఒక్క అక్షరం తప్పుగా టైప్ చేయడం వల్ల అమెరికా మిలిటరీ రహస్య ఈ మెయిల్స్, సున్నిత సమాచారం, మ్యాప్ లు, పాస్ వర్డ్స్ మొత్తం మాలి దేశానికి చిక్కింది. ఈ తప్పిదాన్ని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల పాటు యూఎస్ కొనసాగించిందని ఓ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. సాధారణంగా అమెరికా సైన్యం.. తమ బృందాలతో కమ్యూనికేషన్ కోసం .MIL అనే డొమైన్ వాడుతుంది. ఈ క్రమంలో అమెరికా సైన్యం చాలా సందర్భాల్లో మెయిల్ చేసే సందర్భంలో .MILకి బదులు.. .ML వాడారు. దాంతో ఆ మెయిల్స్ అన్నీ మాలి డొమైన్ కు చేరాయి.

అమెరికా సమాచారం చేతులు మారుతుందని.. జోహన్నస్ జౌర్బిర్ అనే డచ్ వ్యాపారవేత్త కనుగొన్నాడు. మాలి డొమైన్ నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తుంటాడు. మొదట ఈ మెయిల్స్ అన్నీ పొరపాటున వస్తున్నయ్ అనుకోగా.. రాను రాను వాటి సంఖ్య పెరిగింది. అలా పదేళ్ల నుంచి ఇప్పట వరకు 1,17,000 వచ్చాయి. ఈ మెయిల్స్ లో అమెరికా రహస్య మెయిల్స్, మ్యాప్స్, పాస్ వర్డ్స్, ఆర్మీ మెడికల్ రికార్డ్స్, స్థావరాల ఫొటోలు లాంటి సమాచారం ఉన్నాయి. మాలి రష్యాకు మిత్ర దేశం. రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ మాలిలోనే ఉంది. సైబర్ దాడిని ప్రధాన ఆయుధంగా చేసుకున్న వాగ్నర్ గ్రూప్ కు ఈ సమాచారం చిక్కితే.. అమెరికాకు తీవ్ర ముప్పు ఎదురయ్యే అవకాశం ఉంది.



Updated : 18 July 2023 12:37 PM GMT
Tags:    
Next Story
Share it
Top