Home > అంతర్జాతీయం > ప్రఖ్యాత శివాలయంలో 10కిలోల బంగారం మాయం !

ప్రఖ్యాత శివాలయంలో 10కిలోల బంగారం మాయం !

ప్రఖ్యాత శివాలయంలో 10కిలోల బంగారం మాయం !
X

నేపాల్‌లోని ప్రఖ్యాత పశుపతినాథ్‌ ఆలయంలో బంగారం మాయమైందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆలయాలంలో ఉండాల్సిన 100 కిలోల బంగారంలో ప్రస్తుతం సుమారుగా 90 కిలోలు మాత్రమే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దాదాపు 10కిలోల నగలు కనబడడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై అవినీతి నిరోధక శాఖ దృష్టిసారించింది. ఆదివారం ఆలయంలో దర్శనం నిలిపివేసి అధికారులు సోదాలు చేపట్టారు.





అత్యంత ప్రాచీనమైన నేపాల్ దేశ రాజధాని కాఠ్‌మాండూలో హిందూ దేవాలయాల్లో పశుపతినాథ్‌ ఆలయం ఒకటి. అందులోని శివలింగం చుట్టూ బంగారంతో కూడిన జలహరిని గతేడాది మహాశివరాత్రి సమయంలో ఏర్పాటు చేశారు. ఆ ఆభరణాల్లో దాదాపు 10కిలోల బంగారం మాయమైందన్న వార్తలు వచ్చాయి. పార్లమెంటులోనూ ప్రశ్నలు లేవనెత్తారు. నేపాల్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేపాల్‌ అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆలయంలోకి భక్తులను రానీయకుండా నిషేధించి.. తనిఖీలు చేపట్టారు. విచారణ సందర్భంగా పశుపతి ఆలయ ప్రాంగణంలో నేపాల్ ఆర్మీ సైనికులతో సహా పలువురు భద్రతా సిబ్బందిని మోహరించారు.

కాఠ్‌మాండూలోని బాగమతి నది ఒడ్డున ఈ శివ క్షేత్రం ఉంది. ఇక్కడ శివుడు పశుపతి నాథ్ గా పూజలను అందుకుంటున్నాడు. భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు.


Updated : 25 Jun 2023 9:38 PM IST
Tags:    
Next Story
Share it
Top