Home > అంతర్జాతీయం > ఏపీ రాజధాని అమరావతే, కేంద్రం నిర్ణయం అదే.. బీజేపీ చీఫ్

ఏపీ రాజధాని అమరావతే, కేంద్రం నిర్ణయం అదే.. బీజేపీ చీఫ్

ఏపీ రాజధాని అమరావతే, కేంద్రం నిర్ణయం అదే.. బీజేపీ చీఫ్
X

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన అస్తవ్యస్తంగా మారిని, బడగుబలహీన వర్గాలపై దాడులు రోజురోజుకరూ పెరిగిపోతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జగన్ ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు. అమరావతి అందరిదీ అని, అదే రాష్ట్ర రాజధాని అని స్పష్టం చేశారు. తాము రాజధానిలో పేదల ఇళ్లనిర్మాణాలకు వ్యతిరేకం కాదని, భూములిచ్చిన రైతులకు కూడా న్యాయం జరగాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు.

‘‘ఆర్-5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణ కేసు కోర్టులో ఉంది. పేదలకు ఇళ్లు ఇవ్వొద్దని మేం అనడం లేదు. మాపై దుష్ర్పచారం చేస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి కేంద్రం రూ.1.8 లక్షలు కేంద్రం ఇస్తోంది. వాస్తవం ఇదైతే కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిగా ఉండాలన్నది కేంద్రం నిర్ణయం. దానికే కట్టుబడి ఉంటుంది’’ అని ఆమె అన్నారు. ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు తన వాళ్లని చెబుతున్న జగన్ తన ఇంటికి కూతవేటు దూరంలోనే ఒక దళిత మహిళపై అత్యాచారం జరిగితే ఎందుకు మాట్లాడలేకపోయారని ఆమె నిలదీశారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర వనరులనకు తమకిష్టమైన దోచిపెడుతోంది, అడ్డుకుంటున్నవారిపై దాడులు చేయిస్తోందని పురందేశ్వరి మంగళవారం విజయవాడలో విలేకర్ల సమావేశంలో అన్నారు.


Updated : 25 July 2023 11:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top