Home > అంతర్జాతీయం > యాపిల్ ఫోన్‌లను కొనని జనాలు.. ఎందుకంటే?

యాపిల్ ఫోన్‌లను కొనని జనాలు.. ఎందుకంటే?

యాపిల్ ఫోన్‌లను కొనని జనాలు.. ఎందుకంటే?
X

ఐఫోన్ అమ్మకాలు క్షీణించాయి. ఆపిల్ ప్రోడక్ట్స్ అమ్మకాలలో అతిపెద్ద క్షీణత చైనాలో కనిపిస్తుంది, చైనాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఐఫోన్‌ బ్రాండ్‌తో సమానంగా వివిధ బ్రాండ్స్ మార్కెట్‌లోకి తమ ఉత్పత్తులను విడుదల చెస్లున్నాయి. తాజాగా హువావే మేట్ 60 సిరీస్‌ను చైనాలో ప్రారంభించిన తర్వాత, ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు భారీగా తగ్గాయి. హువావే మేట్ 60 గట్టి పోటీ ఇస్తుండడంతో యాపిల్ రెట్టింపు నష్టాలను చవిచూస్తోంది.

సిలికాన్ వ్యాలీ దిగ్గజం టెక్ కంపెనీ Apple అమ్మకాలు పడిపోవడంతో క్రమంగా మార్కెట్ షేర్ కూడా తగ్గుతుంది. యాపిల్‌ ప్రత్యామ్నాయ వ్యాపారాలపై దృష్టి పెట్టకపోవడం కూడా క్షీణతకు మరో కారణమని చెప్పవచ్చు. యాపీల్ క్షీణతను ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ క్యాష్ చేసుకుంటుంది. ప్రస్తుత ట్రెండిగ్ టెక్నాలజీ అయినా ఓపెన్‌ ఏఐలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టింది, దీని కారణంగా మైక్రోసాఫ్ట్ షేర్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం OpenAI ప్రోడక్ట్ ChatGPTకి మార్కెట్లో మంచి స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే.

గతేడాది 48 శాతం ఎగబాకిన యాపిల్ షేర్లు ..

గతేడాది యాపిల్ షేర్లలో 48 శాతం ఎగబాకిన, 2024లో మాత్రం క్షీణత కనిపిస్తుంది.2024లో ఇప్పటివరకు యాపిల్ షేర్లు 4 శాతం క్షీణించాయి. మైక్రోసాఫ్ట్ విషయానికి వస్తే 2023 సంవత్సరం కంటే ఈ ఏడాది 57 శాతం పెరుగుదల నమోదైంది. 2024లో ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ షేర్లు 2 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

యాపిల్ షేర్ల పతనం:

గత బుధవారం ఆపిల్ షేర్లలో 0.4 శాతం క్షీణత నమోదు కాగా, మైక్రోసాఫ్ట్ షేర్లలో 1.6 శాతం పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం Apple మార్కెట్ విలువ $2.866 ట్రిలియన్లు కాగా, Microsoft మార్కెట్ విలువ $2.837 ట్రిలియన్లు. ఇక 2024లో చైనాలో ఐఫోన్ విక్రయాలు 30 శాతం క్షీణించాయని జెఫరీస్ అనాలసిస్ పేర్కొంది. మార్కెట్ విలువ పరంగా రెండు కంపెనీల మధ్య పెద్ద తేడా లేనప్పటికీ.. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మాత్రం యాపిల్ షేర్లు మరింతగా దిగజారే అవకాశం ఉంది.

Updated : 11 Jan 2024 12:24 PM IST
Tags:    
Next Story
Share it
Top