చైనాకు అమెరికా షాక్ ఇవ్వనుందా?
X
డ్రాగన్ దేశానికి అమెరికా దూరం అవ్వాలనుకుంటోందా...అంటే అవుననే చెబుతున్నారు టెక్నాలజీ నిపుణులు. దీనికి కారణం ఐఫోన్ల తయారీలో ఆ కంపెనీ తీసుకున్ నిర్ణయమే. ఈ ఫోన్ ల తయారీలో ప్రధాన దేశమైన చైనాను కాదని ఆపిల్ కంపెనీ మిగతా దేశాలకు తరలిస్తోంది. అందులో భాగంగానే భారత్ లో ఐఫోన్ 15ను భారీ ఎత్తున తయారు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తమిళనాడులోని పెరంబదూర్ కేంద్రంగా ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూప్ ప్లాంట్ ఉంది. ఇందులో ఐఫోన్ ల తయారుచేస్తారు. అయితే ఇప్పుడు మరింత ఎక్కువగా ఫోన్లను తయారుచేయాలని ఆపిల్ కంపెనీ భావిస్తోంది. చైనాలో తయారైన యాపిల్ ప్రొడక్ట్ లు మిగతా దేశాలకు దిగుమతి చేసిన వారం రోజుల తర్వాత నుంచి ఇది మొదలవనుంది. చైనాలో వ్యాపారం ఎప్పటికైనా ప్రమాదమని ఆపిల్ కంపెనీ ఎప్పటి నుంచో భావిస్తోంది. అందుకే కొన్నేళ్ళుగా తన వ్యాపారాన్ని ప్రపంచంలో మిగతా దేశాల్లో కూడా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే భారత్ లోకూడా ఐఫోన్ తయారీ మొదలుపెట్టనుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
డ్రాగన్ కంట్రీలో సప్లయ్ చైన్ సమస్యలున్నాయి. దాంతో పాటూ చైనా-అమెరికా మధ్య వాపార సత్సంబంధాలు తగ్గిపోతున్నాయి. అందుకే ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనాలో సప్లయ్ చైన్ సమస్యల కారణంగానే భారత్ లో తయారైన ఐఫోన్ షిప్ మెంట్ విలువ 65 శాతం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 85శాతం ఐఫోన్ లను చైనానే తయారు చేస్తోంది. దీనిని ఇప్పుడు బయట దేవాలకు తరలించడం వలన బీజింగ్ తన ఆదిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.