Home > అంతర్జాతీయం > Kazma_Kazmitch : కరెన్సీ వర్షం కురిపించిన ఇన్‌ఫ్లుయెన్సర్.. వీడియో

Kazma_Kazmitch : కరెన్సీ వర్షం కురిపించిన ఇన్‌ఫ్లుయెన్సర్.. వీడియో

Kazma_Kazmitch : కరెన్సీ వర్షం కురిపించిన ఇన్‌ఫ్లుయెన్సర్.. వీడియో
X

చెక్ రిపబ్లిక్‌లోని నాడ్ లాబెమ్ (Lysa nad Labem) పట్టణంలో నోట్ల వర్షం కురిసింది. ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ , టెలివిజన్ హోస్ట్ అయిన కమిల్ బర్తోషేక్.. హెలికాప్టర్ నుండి భూమి మీదకు నోట్ల వర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక మిలియన్ డాలర్లు వర్షంలా కురవటంతో ఆ నోట్లను ఏరుకోవటానికి జనాలు భారీగా ఎగబడ్డారు.

మిస్టర్ బార్టోస్టైక్, కజ్మా అనే మారుపేరుతో బాగా పాపులర్ అయిన కమిల్ ఇటీవల ఓ పోటీని నిర్వహించాడు. దాంట్లో విజేతకు ఈ భారీ నగదుని బహుమతిగా ప్రకటించాడు. ఈ పోటీలో భాగంగా ‘వన్ మాన్ షో ది మూవీలో పొందు పరిచిన కోడ్ ను ఛేధించాలి. కానీ ఈ కోడ్ ను ఎవరు పరిష్కరించలేకపోయారు. దీంతో ఏం చేయాలా అని ఆలోచించాడు. పోటీదారులందరికీ ఆ డబ్బును పంచాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో ఆదివారం ఆరుగంటలకు ఆ డబ్బును పంచుతానని పోటీదారులకు మెయిల్‌ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు ఆ సమయానికి రావాల్సిందిగా ఓ ప్రదేశాన్ని మెయిల్‌ద్వారా సమాచారం ఇచ్చాడు.





చెప్పిన సమయానికి ఓ కంటైనర్ లో మిలియన్ డాలర్ల కరెన్సీని లోడ్ చేసుకుని అతను చెప్పిన ఏరియాకు వచ్చాడు. లాబెమ్ పట్టణానికి సమీపంలోని ఓ ప్రదేశంలో హెలికాఫ్టర్‌ ద్వారా నోట్లను వెదజల్లాడు. అతను అందించిన సమాచారంతో ఆ ప్రాంతానికి చేరుకున్నవారంతా ఆ నోట్లను ఏరుకునేపనిలో పడ్డారు. 1000,000 డాలర్లు అంటూ భారతీయ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.83 కోట్లకు పైనే. కమిల్ హెలికాప్టర్ ద్వారా నోట్లు కురిపిస్తుంటం చూసిన ఆ చుట్టుపక్కల పొలాల్లో పనిచేసుకునేవారు కూడా వచ్చి ఏరుకున్నారు. సంచుల్లో నింపుకున్నారు. కజ్మా వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ డబ్బును 4000మంది వ్యక్తులు ఏరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కజ్మా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. నోట్లను దక్కించుకునే క్రమంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అంతా సజవుగానే జరిగిందని కజ్మా వెల్లడించాడు.



Updated : 26 Oct 2023 1:15 PM IST
Tags:    
Next Story
Share it
Top