Home > అంతర్జాతీయం > 33 ఏళ్లుగా గృహనిర్భందం.. 78 వయసులో కూడా జైలు శిక్ష..చివరికి క్షమాభిక్ష దొరికింది

33 ఏళ్లుగా గృహనిర్భందం.. 78 వయసులో కూడా జైలు శిక్ష..చివరికి క్షమాభిక్ష దొరికింది

33 ఏళ్లుగా గృహనిర్భందం.. 78 వయసులో కూడా జైలు శిక్ష..చివరికి క్షమాభిక్ష దొరికింది
X

2021 నుంచి చెరసాలలో ఉన్న మయన్మార్ కీలక నేత ఆంగ్ సాన్ సూకీకి (78) విముక్తి లభించింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా అక్కడి సైనిక ప్రభుత్వం ఆమెకు క్షమాభిక్ష పెట్టినట్లు తెలుస్తోంది. 2021లో సూకీని వేరువేరు కేసుల్లో దోషిగా తేల్చి జైలుకు తరలించారు. కాగా అందులోని ఐదు కేసుల్ని కొట్టేసి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మరో 14 కేసులు అలానే ఉన్నాయి. ఆంగ్ సాన్ సూకీతో పాటు.. మయన్మార్ జైలులో ఉన్న దాదాపు ఏడువేల మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు.

మయన్మార్ ఎన్నికల ఫ్రాడ్ కు చెందిన కేసుల్లో సూకీని అరెస్ట్ చేయగా.. వాటిని ఖండిస్తూ ఆమె కోర్టులో పోరాడుతోంది. కాగా, గత సోమవారం ఆమెను జైలు నుంచి ప్రభుత్వం బిల్డింగ్ కు తరలించారు. క్షమాభిక్ష దొరికినా ప్రస్తుతం ఆమెను గృహనిర్భందంలోనే ఉంచింది అక్కడి ప్రభుత్వం. సూకీ మొదటి సారిగా 1989లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన సూకీని గృహనిర్భందంలో ఉంచారు. అప్పటి నుంచి 2010 వరకు ఆవిడ గృహనిర్భందంలోనే ఉన్నారు.

ప్రజాస్వామ్య స్థాపనకు కృషి చేసిన ఆమెకు 1991 ఆమెకు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. 2015, 2020 ఎలక్షన్స్ లో ఆమె పార్టీ మయన్మార్ లో విజయం సాధించింది. ఆ తర్వాల 2021లో సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి.. సైన్యం బాధ్యతలు చేపట్టింది. ఇక అప్పటి నుంచి అక్కడ సైనిక పాలన కొనసాగుతోంది. ఆ తర్వాత సూకీతో పాటు ఆమె అనుచరులు ఎన్నికల్లో అవకతవకలు జరిపారనే ఆరోపణలతో కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో క్షమాభిక్షతో సూకీ 33 ఏళ్ల జైలు 6 ఏళ్లకు తగ్గించారు.

Updated : 1 Aug 2023 10:13 PM IST
Tags:    
Next Story
Share it
Top