Home > అంతర్జాతీయం > స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా మంత్రి

స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా మంత్రి

స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా మంత్రి
X

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ స్వలింగ వివాహం చేసుకున్నారు. అదే దేశానికి చెందిన సోఫియా అల్లౌకేను పెళ్లాడారు. రెండు దశాబ్ధాలుగా స్నేహితులుగా ఉన్న వాంగ్, అల్లౌకేతో అడిలైట్ పట్టణంలో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. వీరి పెళ్లి సంబంధించిన ఫోటోను వాంగ్ ఇన్‌స్టాలో షేర్ చేశారు.

కాగా ఆస్ట్రేలియాలో 2017 నుంచి స్వలింగ మ్యారేజ్‌లకు చట్టబద్దం చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంటులో తొలి లెస్బియన్ ఎంపీగా ఉన్నారు. ఆస్ట్రేలియా క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న తొలి ఆసియా సంతతి మహిళగా పెన్నీ వాంగ్ కు గుర్తింపు ఉంది. తన సహచరి సోఫియాతో పెళ్లి విషయాన్ని పెన్నీ వాంగ్ స్వయంగా వెల్లడించారు. సన్నిహితులు, మా సామాజిక వర్గీయులతో కలిసి ఈ స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఆనందదాయకం అని వాంగ్ వెల్లడించారు.

Updated : 17 March 2024 5:12 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top