ప్రేమ కోసం ఏడాది కొడుకుతో సహా భారత్‌కు వచ్చి బంగ్లాదేశ్ మహిళ
X
దేశ సరిహద్దులను దాటి మరీ ప్రేమ కోసం భారత్‌కు తరలివస్తున్నారు ప్రియురాళ్లు. మొన్న తన ప్రియుడు సచిన్ కోసం పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదరీ కహానీ మరిచిపోకముందే మరో మహిళ తన ప్రియుడి కోసం దేశ సరిహద్దులు దాటి మరీ భారత్‌కు చేరుకుంది.
లేటెస్టుగా బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మహిళ తన ఏడాది కొడుకుతో సహా భారత్‌కు వచ్చింది. ఆమె తన పేరు సానియా అఖ్తర్ అని తన భర్త కోసం భారత్ వచ్చానని చెబుతోంది.
సానియా అఖ్తర్ బంగ్లాదేశ్ మహిళ. ఆమెకు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కల్టీ మ్యాక్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసే సౌరభ్ తో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. సానియా, సౌరభ్‌లు 3 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారని . వీరిద్దరి ఓ ఏడాది కొడుకు కూడా ఉన్నాడు. కొన్నాళ్ల తర్వాత సౌరభ్ బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చేశాడు. ఆ తరువాత సానియాతో కాంటాక్ట్ లేకుండా పోయాడని ఇన్ఫర్మేషన్ ఈ క్రమంలో
తనను పెళ్లి చేసుకుని, తన బిడ్డకు తండ్రైన సౌరభ్‌ను కలిసేందుకు వీసా తీసుకుని మరీ భారత్ వచ్చింది. కొడుకును కూడా వెంటబెట్టుకుని మరీ నోయిడాకు వచ్చింది. అయితే ఆమె ఇక్కడకు వచ్చాక షాకింగ్ న్యూస్ తెలుసుకుంది. తన భర్త తనను కాదని మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంది. దీంతో తన భర్త తనకు ఆశ్రయం కల్పించడం లేదని, తాను మోసపోయానని తెలుసుకుంది. ఈ క్రమంలో ఈ ఉదంతం నోయిడా పోలీసుల వరకూ చేరింది. తనకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను వేడుకుంది సానియా అఖ్తర్. ఆమె తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సౌరభ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని బాధిత మహిళ తెలిపింది.
Bangladesh women Sania Akhtar came Noida with her kid for her husband
Bangladesh, women, Sania Akhtar, India, Noida, with her kid, husband ,Saurabh Kant Tiwari, refusing to get back with her, Indian man, Muslim marriage ceremony , Seema Haider, Pakistan, passport, visa, investigation, Noida police, national news, latest news ,1 Year Old Child , Culti Max Energy Private Limited Company, Dhaka,
After Seema Haider, a Bangladeshi woman - Sonia Akhtar - has reached Noida with her infant alleging a Noida resident, Saurabh Kant Tiwari, married her in 2021 in Bangladesh and deserted her. She has a valid passport and visa. Police have launched an investigation. pic.twitter.com/99o7Eiv8td
— Shafaque Alam (@shafaquealamTOI) August 21, 2023