జిమ్‌లో మెడ విరిగి వరల్డ్ ఫేమస్ ట్రైనర్ మృతి..
X
ఆరోగ్యం కోసం చేసే వ్యాయామాలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. అవగాహన లేక కొందరు, అత్యుత్సాహంతో, అజాగ్రత్తతో కొందరు జిమ్‌కు జిమ్‌లో కన్నుమూస్తున్నాయి. చివరకు కండలు తిరిగిన జిమ్ ట్రైనర్లు కూడా అనూహ్యంగా చనిపోతున్నారు. ఓ ట్రైనర్ అత్యుత్సాహంలో భారీ బరువును లేపబోయి మెడ పుటుక్కున విరిగి అక్కడికక్కడే చనిపోయాడు.ఇండోనేసియాలోని బాలి నగరంలో జరిగిందీ విషాదం. ప్రఖ్యాత ప్రఖ్యాత వ్యాయామ శిక్షకుడు జస్టిన్ విక్కీ ఈనెల 15న జిమ్ వెళ్లాడు. ఓ వ్యక్తి సాయంతో 210 కేజీల బార్‌బెల్‌ను మెడపైకి ఎత్తుతుండగా బ్యాలన్స్ తప్పి మెడ పుటుక్కున విరిగింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మెడ విరగడంతో గుండె, ఊపిరితిత్తుల నరాలు దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారు. 33 ఏళ్ల విక్కీ పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. విక్కీ జిమ్ చేస్తుండగా మెడ విరిగిన దృశ్యం వీడియోలో రికార్డయింది. న్యూయార్క్ లో జన్మించిన విక్కీ బాలిలో స్థిరపడి ఫిట్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేశాడు.
Justin Vicky, a fitness superstar with thousands of social media followers, died while training pic.twitter.com/r44gu3n7T8
— Darkside (@ShortCuts24) July 21, 2023