మా జోలికి వస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం
X
మా దగ్గరకు వస్తే అణుబాంబును ప్రయోగించడానికి ఏమాత్రం ఆలోచించం అంటోంది బెలారస్. తమ దేశ సరిహద్దుల్లో నాటో దేశాలను మోహరించడంతో ఈ హెచ్చరికలను జారీ చేసింది.మా దేశం మీద విదేశాలు దాడులు జరిపితే చేతులు కట్టుకుని కూర్చోమని అంటోంది బెలారస్. రష్యా నుంచి తీసుకున్న అణ్వాయుధాలను ప్రయోగిస్తామని ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ప్రస్తుతం బెలారస్ దేశ సరిహద్దుల్లో నాటో దళాలను మొహరించారు. దీంతో ఆ ప్రదేశాలు అన్నీ ఉద్రిక్తంగా మారాయి. అందుకే అలెగ్జాండర్ ఈ వ్యాఖ్యలను చేశారు. ప్రభుత్వ రంగ వార్తా సంస్థ బెల్టాతో మాట్లాడుతూ ఉక్రెయిన్ సేనలు హద్దు దాటనంత వరకూ మేము ఏమీ చేయము. అప్పటి వరకు అసలు యుద్ధం మాటే ఎత్తము కానీ దేశంలోకి అడుగు పెడితే మాత్రం ఊరుకోము అని చెప్పారు. తమ మిత్ర దేశమైన రష్యాకు సాయం చేయడం మాత్రం మానమని అంటున్నారు.
ఏ దేశానికీ తాము భయపడేది లేదని అలెగ్జాండర్ లకషెంకో అంటున్నారు. మేము ఎవరినో బెదిరించడానికి అణ్వాయుధాలను ఇక్కడకు తీసుకురాలేదు కానీ అవి ప్రత్యర్ధులను బాగా భయపెడతాయని మాత్రం తెలుసు. మా దగ్గర ఉన్నవి నిజానికి చాలా చిన్న అణ్వాయుధాలు. కానీ ఏదైనా ప్రభావం బాగానే ఉంటుంది. ఒకసారి మామాద దాడి మొదలైన తక్షణమే మేము వాటిని వాడడం మొదలుపెడతామని చెబుతున్నారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో బెలారస్ కీలక పాత్ర పోషిస్తోంది. లాస్ట్ ఇయర్ రష్యా , బెలారస్ సేనలు కలిసి యుద్ధ విన్యాసాలు చేశాయి. ఈ ఏడాది ూన్ లో రష్యా నుంచి బెలారస్ కు అణ్వాయుధాలు వెళ్ళాయి. ఇవి రక్షణ కోసం తరలిస్తున్నామని అప్పుడే చెప్పారు కూడా. ఈ విషయం స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతినే తెలిపారు. అయితే ఎన్ని వెళ్ళాయి అన్నది మాత్రం ప్రకటించలేదు. మరోవైపు బెలారస్ లో అణ్వాయుధాలు ఉన్నా వాటి మీద నియంత్రణ రష్యా అధ్యక్షుడికే ఉంటుంది కానీ చెలారస్ అధ్యక్షుడు లుకషెంకోకు ఉండదని అమెరికా ఢిఫెన్స్ ఇంటలిజెన్స్ చెబుతోంది.