సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగళం.. ఎక్కడంటే..?
X
సముద్రం.. ఎన్నో జీవరాశులకు నిలయం. లోపల చనిపోయి తీరానికి ఎన్నో జీవులు కొట్టుకొస్తుంటాయి. ఒక్కోసారి అరుదైన చేపలు, తిమింగళాలు తీరానికి కొట్టుకొస్తాయి. ఈ అరుదైన వాటిని చూడడానికి జనం కూడా ఎగబడతారు. ప్రస్తుతం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం కొట్టుకొచ్చింది. దీన్ని చూసేందుకు చుట్టుపక్కల జనం భారీగా తరలివచ్చారు.
ఈ తిమింగళం సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది. ఈ భారీ బ్లూ వేల్.. బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అల్పపీడనంతో సముద్రం అల్లకల్లోలంగా మారగా.. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో తిమింగళం చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు.
దంచికొడుతున్న వానలు
ఇక ఏపీ తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు ప్రాజెక్టులు సహా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అటు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్ట్ 70 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.