Home > అంతర్జాతీయం > పాపం కుక్కల ఉద్యోగం పోగొట్టాయిగా.. అక్కడ జైళ్లకు కాపలాగా బాతులు

పాపం కుక్కల ఉద్యోగం పోగొట్టాయిగా.. అక్కడ జైళ్లకు కాపలాగా బాతులు

పాపం కుక్కల ఉద్యోగం పోగొట్టాయిగా.. అక్కడ జైళ్లకు కాపలాగా బాతులు
X

జైలు భద్రతకు పోలీస్ సెక్యూరిటీతో పాటు.. సీసీటీవీలు, కుక్కల్ని ఏర్పాటుచేస్తారు ఎవరైనా. ఫర్ ఎ చేంజ్.. ఈ జైలులో మాత్రం అవేవీ ఉండవు. వాటికి బదులుగా బాతులను ఉపయోగిస్తున్నారు. కుక్కలకు ఇచ్చినట్లు.. వాటికి ట్రైనింగ్ ఇచ్చి మరీ ఉద్యోగంలో పెడుతున్నారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా.. నిజంగా నిజం. ఈ వింత జైలు ఉన్నది బ్రెజిల్ లోని శాంటా కాటారినా రాష్ట్రంలో. గతంలో అక్కడి జైళ్లలో పనిచేసు కుక్కలను విదుల్లోంచి తప్పించి.. బాతులను అపాయింట్ చేసుకున్నారు.

శాంటా కాటారినా జైళ్లలో కూడా పటిష్ఠ భద్రత ఉంటుంది. సీసీటీవీ, పోలీస్ భద్రతతో కట్టుదిట్టంగా వ్యవహరిస్తారు. అయితే బాతులను కాపలాగా ఉంచడంపై ఆ జైలు డైరెక్టర్ మార్కోస్ రాబర్టో డి సౌజా క్లారిటీ ఇచ్చాడు. తామెవ్వరు చేయని పనిని బాతులు చేస్తున్నాయంటున్నాడు. ‘మా జైలు పగలు, రాత్రి ఒకేలా నిశబ్దంగా ఉంటుంది. బాతులు కొంచెం భయంతో కూడిన స్వభావంతో ఉంటాయి. ఏ కొంచెం అలజడి, కదలికలు జరిగినా భయంతో అరుస్తూ పరుగులు పెడతాయి. అదే మాకు ప్లస్ అయింది. జైల్లో ఎప్పుడు ఏం జరిగినా వెంటనే బాతులు శబ్దం జరిగినా బాతులు పెద్దగా అరుస్తూ పరుగులు పెడతాయి. దాంతో పోలీసులు అలర్ట్ అవుతారు. కాగా గతంలో ఇక్కడి జైల్లో కుక్కలు పని చేసేవి. ప్రస్తుతం వాటిని విధుల నుంచి తప్పించాం. కుక్కలకన్నా బాతుల నిర్వాహణ చాలా సులభం. ఖర్చు కూడా చాలా తక్కువ’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Updated : 24 Dec 2023 3:19 PM IST
Tags:    
Next Story
Share it
Top