ఫోన్‌తోపాటు గుండెనూ దోచుకున్న దొంగవెధవ.. లవ్ స్టోరీ ప్రపంచమంతా వైరల్
X
దొంగను ప్రేమించి పెళ్లాడడం కేవలం సినిమాకే పరిమితమైన కథ కాదు. కొందరు దొంగలు వస్తువులనే కాదు అంతకంటే విలువైన హృదయాలనూ దోచుకుంటున్నారు. వలలో పడిన అమ్మాయిలు ఆ దొంగలపై పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతున్నారు. కులమతాలు, పరువు ప్రతిష్ట, ఆస్తులు అంతస్తులు, భవిష్యత్తు వంటివేవీ పట్టించుకుండా, ‘నా దొంగప్రియుడే నా జీవిత సర్వస్వం’ అని సినిమా డైలాగులు కొడతారు. బ్రెజిల్‌కు చెందిన ఓ అమ్మడు అచ్చం అలాగో చెబుతూ ప్రపంచ వింతై కూర్చుంది. దొంగోడిని ఇష్టపడిన ఆమె ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. కొందరు చెడామడా తిడుతుంటే కొందరు మాత్రం, తప్పేముందని సమర్థిస్తున్నారు.
రెండేళ్ల కింద ఎమానుయెలా అనే యువతి రోడ్డులో వయ్యారంగా వెళ్తుండగా దొంగ ఆమె మొబైల్ ఫోన్ కొట్టేశారు. తర్వాత ఫోన్లోని ఆమె ఫొటోలు వీడియోలు చూసి మనసు పారేసుకున్నాడు. ఆమెను కాంటాక్ట్ అయ్యి ‘ఐ లవ్ యూ’ అన్నాడు. అమ్మడు ఏ మూడ్‌లో ఉన్నదోగాని ఓకే అంది. అప్పట్నుంచీ ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరగడం మొదలు పెట్టారు. అతడు దొంగ అని తెలిసిన జనం, వాడితో లవ్వేమిటి బుద్ధిలేకుండా అని తిట్టారు. ఆమె వెనక్కి తగ్గలేదు. ‘‘దొంగోడైతేనేం.. మంచి మనసు ఉంది. నన్ను బాగా ప్రేమిస్తాడు. నాకంతే చాలు’’ అని చెబుతోంది. వీరి వింత ప్రేమ గురించి తెలిసిన మీడియా తెగ ఇంటర్వ్యూలు చేస్తోంది. ‘‘ఫోన్లో ఆమె ఫోటోలు చూశాక నాకు నిద్రపట్టలేదు. అంత అంతమైన మేనిఛాయ ఉన్న మగువను నా జీవితంలో చూడలేదు. అందుకే మాట కలిపా’’ అన్నాడు ప్రియుడు. ‘‘అంటే ఫోన్‌తోపాటు హార్ట్‌నూ కొట్టేశావన్నమాట’ అని యాంకర్ అడగ్గా, ‘యా..’ అని బదులిచ్చాడు.
Calma Milton , nossa sociedade é muito sadia mentalmente ainda 🙃 pic.twitter.com/PkaMQkLK54
— Bender B. Rodríguez 🇲🇽 (@BenderEyes) July 21, 2023