Home > అంతర్జాతీయం > టిప్పు సుల్తాన్ వారసురాలికి..బ్రిటన్ గౌరవం

టిప్పు సుల్తాన్ వారసురాలికి..బ్రిటన్ గౌరవం

టిప్పు సుల్తాన్ వారసురాలికి..బ్రిటన్ గౌరవం
X

టిప్పు సుల్తాన్ వారసురాలు, భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మహిళా స్పై నూర్ ఇనాయత్ ఖాన్‎కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్‎కు చేసిన సేవలకు గుర్తుగా రాణి కెమిల్లా ఇనాయత్ ఖాన్‎కు నివాళులు అర్పించడంతో పాటు ఆమె చిత్రపటాన్ని ఆవిష్కరించారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ క్లబ్‌ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. అంతేకాదు ఈ క్లబ్‌లోని ఓ గదికి ఆమె మేరు పెట్టి గౌరవించారు. ఇదే క్రమంలో ప్రముఖ భారత సంతతి రచయిత్రి శ్రాబణి బసూ ఇనాయత్ ఖాన్ బయోగ్రఫీ బుక్‎ని రాణికి బహూకరించారు.

బ్రిటన్ ఎయిర్‌ఫోర్స్‌లోని మహిళా విభాగంలో ఇనాయత్ ఖాన్ గూఢాచారిగా విధులు నిర్వహించారు. ఆమె స్పైగా బ్రిటన్‎కు విశేష సేవలు అందించారు. విధి నిర్వహణలో ఎప్పుడూ ఆమె వెనకడుగువేయలేదు. భయానక ప్రమాద సమయాల్లోనూ ఆమె అద్భుతమైన ధైర్యసాహసాలను ప్రదర్శించేవారు. అందుకే బ్రిటన్ సర్కార్ అప్పట్లో ఆమెను జార్జ్ క్రాస్‌తో సత్కరించింది. ఎయిర్ ఫోర్స్ మహిళా సెక్టార్‎లో అవార్డులను దక్కించుకున్న ఇద్దరు మహిళల్లో ఇనాయత్ ఖాన్ ఒకరు.

నూర్ ఇనాయత్ ఖాన్‎ 1914లో మాస్కోలో పుట్టారు. ఆమె తండ్రి సూఫీ సన్యాసి , ఈయన ఇండియాకు చెందిన వారు. ఆమె తల్లి అమెరికా వాస్తవ్యురాలు. నూర్ చిన్నతనంలోనే ఆమె కుటుంబం బ్రిటన్‌కు చేరుకుంది. దీంతో ఫ్రాన్స్‌లోని ఓ పాఠశాలలో నూర్ తన స్టడీస్‎ను పూర్తి చేసింది. సెకెండ్ వరల్డ్ వార్‎లో ఫ్రాన్స్ ఓడిపోయిన తరువాత ఇంగ్లండ్‌కు చేరుకున్ననూర్ బ్రిటన్ ఎయిర్ ఫోర్స్‌లోని వుమెన్ సెక్టార్‎లో చేరారు. నిఘా కార్యకలాపాలు, గూఢచర్యంతో శత్రువుల కట్టడి కోసం ఉద్దేశించి ఎస్ఓఈ విభాగంలో ఆమె విధులు నిర్వహించింది. ఫ్రాన్స్‌పై నిఘా కోసం నియమించిన తొలి మహిళా స్పైగా నూర్ రికార్డు సృష్టించారు. పలు డేంజరస్ మిషన్‎లలో ఆమె అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించారు. బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి అవార్డులను అందుకున్నారు. శత్రువులకు చిక్కినా నూర్ బ్రిటన్‎కు సంబంధించిన సమాచారాన్ని ఎక్కడా లీక్ చేయలేదు. నూర్ మరణించిన తరువాత బ్రిటన్ సర్కార్ ఆమెను జార్జి క్రాస్ అవార్డుతో సత్కరించింది.






Updated : 31 Aug 2023 12:42 PM IST
Tags:    
Next Story
Share it
Top