Home > అంతర్జాతీయం > NATS : నెట్వర్క్ ఫెయిల్.. నిలిచిపోయిన విమానాలు

NATS : నెట్వర్క్ ఫెయిల్.. నిలిచిపోయిన విమానాలు

NATS : నెట్వర్క్ ఫెయిల్.. నిలిచిపోయిన విమానాలు
X

బ్రిటన్ లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సాంకేతిక సమస్యను ఎదుర్కొంటోంది. కంప్యూటర్లలో వచ్చిన సాంకేతిక సమస్యల వల్ల బ్రిటన్ ఎయిర్ వేస్ పనిచేయలేదు. నెట్వర్క్ వ్యవస్థ ఫెయిల్ కావడంతో బ్రిటన్ గగనతలాన్ని మూసేశారు. దీంతో అంతర్జాతీయ విమానాలతో సహా అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఈ కారణంతో ఎయిర్ పోర్ట్స్, విమానాల్లో చిక్కుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక సమస్యల వల్ల బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్వర్క్ వ్యవస్థ పనిచేయడంలేదని బ్రిటన్ జాతీయ ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ ప్రతినిధులు తెలిపారు. దీంతో విమాన రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఈ లోపాన్ని సరిచేసేందుకు ఎయిర్ లైన్ ఇంజినీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు.


Updated : 28 Aug 2023 7:06 PM IST
Tags:    
Next Story
Share it
Top