Home > అంతర్జాతీయం > 27 ఏళ్ల ఉద్యోగంలో ఒక్క సెలవు కూడా పెట్టని ఉద్యోగి..

27 ఏళ్ల ఉద్యోగంలో ఒక్క సెలవు కూడా పెట్టని ఉద్యోగి..

27 ఏళ్ల ఉద్యోగంలో ఒక్క సెలవు కూడా పెట్టని ఉద్యోగి..
X

వృత్తినే దైవంగా భావించి.. ఆ పనినే నమ్ముకొని పని చేసినందుకు ఓ ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత అద్భుతమైన ఫలితం దక్కింది. రెస్టారెంట్‌లో ఉద్యోగిగా 27సంవత్సరాల పాటు సెలవు తీసుకోకుండా పని చేసిన వ్యక్తికి గోఫండ్‌మీ అనే క్రౌడ్‌సోర్స్‌డ్ విరాళాల ద్వారా 4,22,185 డాలర్లు (రూ. 3.50 కోట్లు) సొమ్ము అందింది. అమెరికాలోని లాస్‌వెగాస్‌కు చెందిన బర్గర్‌కింగ్‌ చైన్‌ రెస్టారెంట్‌లో 54 ఏళ్ల కెవిన్‌ ఫోర్ట్.. 27సంవత్సరాల పాటు సెలవు తీసుకోకుండా పని చేసినట్లుగా కంపెనీ ప్రకటించింది. అందుకు ఆ రెస్టారెంట్ యాజమాన్యం .. అతని పనితనానికి మెచ్చి రివార్డులు ఇస్తామని ప్రకటించింది. అందుకు సంబంధించిన వీడియోను కెవిన్ ఫోర్డ్.. తన టిక్ టాక్ లో పోస్ట్ చేయగా అది విపరీతంగా వైరల్ అయింది.





ఆ వీడియోలో, ఫోర్డ్ తన యజమాని నుండి ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌ని అందుకున్నట్లు కనిపించాడు కెవిన్ . గిప్ట్ బ్యాగ్‌గా చెప్పబడుతున్న ఆ సంచిలో సినిమా టికెట్లు, స్వీట్లు, పెన్నులు, కీచైన్‌లు, స్టార్‌బక్స్ కప్పులు.. ఇంకా ఏవో ఇతర వస్తువులు ఉన్నాయి. ఇది చూసిన నెటిజన్లు.. ఆ బహుమతులు చాలా చవకగా అనిపించాయని.. అతను అంతకంటే ఎక్కువ బహుమతికి అర్హుడని సూచించారు.కెవిన్ కూతురు సెరీనా తండ్రి క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్క‌లేద‌ని భావించి తానే రంగంలోకి దిగింది.

27 ఏళ్ల క్రితం.. తనకు, తన సోదరికి ఒక సింగిల్ ఫాదర్‌గా కుటుంబాన్ని పోషించలేని సమయంలో.. తన తండ్రి ఆ ఉద్యోగం చేయడం ప్రారంభించాడని అతడి కూతురు తెలిపింది. ఆ ఉద్యోగం లో చేరిన తర్వాతే.. తాము కడుపునిండా భోజనం చేశామని, ఆ తర్వాత తన తండ్రి మరో మహిళను పెళ్లిచేసుకున్నాడని చెప్పింది. ప్రస్తుతం మరో ఇద్దరు చెల్లెళ్లతో కలసి.. మొత్తం నలుగురి చదువులు, ఆరోగ్య సంరక్షణ కోసం ఆ కంపెనీ బీమా ఇస్తుందని తెలియడంతోనే.. తన ఫాదర్ 27 ఏళ్లుగా సెలవంటూ తీసుకోకుండా పనిచేస్తున్నాడని తెలిపింది. త‌న తండ్రికి నిజంగా ద‌క్కాల్సిన గౌర‌వం, పేరుప్ర‌ఖ్యాతుల కోసం ఆమె గోఫండ్‌మి క్యాంపెయిన్ లాంఛ్ చేసింది. ఈ క్యాంపెయిన్‌కు అనూహ్య స్పంద‌న రావ‌డంతో ఏకంగా 4ల‌క్ష‌ల డాల‌ర్లు పైగా (రూ. 3.48 కోట్లు) విరాళాలు స‌మ‌కూరాయి




Updated : 17 Aug 2023 3:14 PM IST
Tags:    
Next Story
Share it
Top