Home > అంతర్జాతీయం > పండుగకొచ్చి.. బురదలో చిక్కుకపోయిన 70వేల మంది..

పండుగకొచ్చి.. బురదలో చిక్కుకపోయిన 70వేల మంది..

పండుగకొచ్చి.. బురదలో చిక్కుకపోయిన 70వేల మంది..
X

అమెరికా నెవడాలోని బ్లాక్ రాక్ ఎడారిలో జరుగుతోన్న బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్కు వర్షం అడ్డు తగిలింది. భారీ వర్షానికి ఎడారి అంతా బురదగా మారింది. దీంతో ఫెస్టివల్కు వచ్చిన 70వేల మంది అందులో చిక్కుకపోయారు. అగస్ట్ 27న ఈ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఆ తర్వాతి రోజు రాత్రి భారీ వర్షం పడింది. మూడు నెలల్లో కురవాల్సిన వాన ఒక్కరాత్రిలో కురిసింది. దీంతో చాలా ఈవెంట్లు రద్దయ్యాయి.




భారీ వర్షంతో ఫెస్టివల్ జరిగే ప్రాంతమంతా బురదమయంగా మారింది. చుట్టూ కిలోమీటర్ల మేర ఎటు చూసినా బురదే కనిపిస్తోంది. దీంతో ఎవరూ ఇక్కడికి రావడానికి, వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. సుమారు 70వేల మంది ఈ బురదలో చిక్కుకున్నారు. నడుస్తుంటే కాళ్లు బరదలో కూరుకపోతుండడంతో కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నారు. వాహనాలు బురదలో చిక్కుకుని మొరాయిస్తున్నాయి. దీంతో వారు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.





బ్లాక్‌రాక్ సిటీని మూసివేసినట్టు అధికారులు తెలిపారు. భూమి ఎండేవరకు వాహనాలను అనమతించం అని ఫెస్టివల్ నిర్వాహకులు స్పష్టం చేశారు. సందర్శకులు ఆహారం, నీరు తీసుకుని పొడిగా ఉంటే ప్రదేశంలో తలదాచుకోవాలని సూచించారు. అయితే కొంతమంది కాలినడకనే ఎడారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొంత మంది మాత్రం బురద ఎండేవరకు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది.






🚨#BREAKING: Burning Man Festival Declares National Emergency as over 73,000 Campers are trapped Urged to Shelter in Place Amid Flooding Crisis


Updated : 3 Sept 2023 4:11 PM IST
Tags:    
Next Story
Share it
Top