Home > అంతర్జాతీయం > చెరువులో పడ్డ బస్సు.. 17 మంది మృతి

చెరువులో పడ్డ బస్సు.. 17 మంది మృతి

చెరువులో పడ్డ బస్సు.. 17 మంది మృతి
X

బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఝలకతి సదర్ జిల్లాలోని ఛత్రకాండ ప్రాంతంలో బస్సు రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా.. 35 మందికిపైగా గాయాల పాలయ్యారు. బాధితుల్లో పలువురు మహిళలు, పిల్లలు ఉన్నారు.

ఉదయం 9.55 గంటల సమయంలో భండారియా నుంచి ఫిరోజ్‌పూర్‌కు వెళ్తున్న బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలోకి వచ్చింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆటోకు సైడ్ ఇస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 నుంచి 70 మంది ఉన్నారు.

బస్సు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని ఝలకతి జిల్లా హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఘటనాస్థలంలో 13 మంది చనిపోగా.. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు అధికారులు చెప్పారు. ప్రమాదం కారణంగా ఖుల్నా-ఝలకతి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.


Updated : 22 July 2023 7:42 PM IST
Tags:    
Next Story
Share it
Top