Home > అంతర్జాతీయం > H-1B వీసాదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కెనడా ప్రభుత్వం

H-1B వీసాదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కెనడా ప్రభుత్వం

H-1B వీసాదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కెనడా ప్రభుత్వం
X

అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారులకు, వారి కుటుంబ సభ్యులకు కెనడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 10,000 మంది అమెరికన్ హెచ్-1బీ వీసా హోల్డర్లు తమ దేశానికి వచ్చి పనిచేయడానికి వీలుగా ఓపెన్ వర్క్ పర్మిట్ స్ట్రీమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ ప్రకటించారు. హెచ్-1బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు స్టడీ లేదా వర్క్ పర్మిట్లను కూడా ఈ ప్రోగ్రామ్ కల్పిస్తుందని కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్ షిప్ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

కెనడా, అమెరికా రెండింటిలోనూ పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల్లో హైటెక్ రంగాల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, అమెరికాలో పనిచేసే వారు తరచూ హెచ్-1బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాను కలిగి ఉంటారని తెలిపారు. జూలై 16, 2023 నాటికి అమెరికాలోని హెచ్-1బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసా హోల్డర్లు, వారితో పాటు వచ్చే కుటుంబ సభ్యులు కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.

కాగా.. కొత్త నిర్ణయం ప్రకారం ఆమోదం పొందిన దరఖాస్తుదారులకు మూడేళ్ల వరకు ఓపెన్ వర్క్ పర్మిట్ లభిస్తుంది. వారు కెనడాలో ఎక్కడైనా, ఏ యజమాని వద్దనైనా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. వారి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు కూడా వర్క్ లేదా స్టడీ పర్మిట్ తో టెంపరరీ రెసిడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందుతారు.

Updated : 28 Jun 2023 12:34 PM IST
Tags:    
Next Story
Share it
Top